Bizarre No Ball : క్రికెట్ చ‌రిత్ర‌లోనే చెత్త నోబాల్‌.. మ్యాచ్ ఫిక్సింగ్ చేశావా ఏంటి..? ఇలా ఎప్పుడు చూడ‌లేదే..?

Bizarre No Ball in Abu Dhabi T10 : క్రికెట్‌లో అప్పుడ‌ప్పుడు బౌల‌ర్లు నోబాల్స్ వేయ‌డాన్ని చూస్తూనే ఉంటాం.

Bizarre No Ball in Abu Dhabi T10

Bizarre No Ball in Abu Dhabi T10 : క్రికెట్‌లో అప్పుడ‌ప్పుడు బౌల‌ర్లు నోబాల్స్ వేయ‌డాన్ని చూస్తూనే ఉంటాం. అయితే.. అబుదాబి టీ10 లీగ్‌లో ఓ విచిత్రం జ‌రిగింది. ఓ బౌల‌ర్ వేసిన నోబాల్ వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. అది అలాంటి, ఇలాంటి నో బాల్ కాదు. క్రికెట్ చ‌రిత్ర‌లోనే దాదాపుగా ఇలా ఎవ‌రు వేసి ఉండ‌దు. ఈ వీడియో చూసిన నెటీజ‌న్లు ఆశ్చ‌ర్య‌పోతున్నారు. మ్యాచ్ ఫిక్సింగ్ చేసిన‌ వాళ్లు కూడా ఇలా వేయ‌ర‌ని కొంద‌రు స‌ర‌దాగా కామెంట్లు చేస్తున్నారు.

ఏం జ‌రిగిందంటే..?

అబుదాబి టీ10 లీగ్‌లో భాగంగా 14వ మ్యాచులో చెన్నై బ్రేవ్స్‌, నార్తర్న్ వారియర్స్ మ‌ధ్య శ‌నివారం మ్యాచ్ జ‌రిగింది. ఈ మ్యాచ్‌లో నార్తర్న్ వారియర్స్ కు అభిమ‌న్యు మిథున్ ప్రాతినిథ్యం వ‌హిస్తున్నాడు. చెన్నై బ్రేవ్స్ బ్యాటింగ్ చేస్తుండ‌గా ఐదో ఓవ‌ర్‌ను మిథున్ వేశాడు. ఈ ఓవ‌ర్‌లోని మూడో బంతిని వేసే క్ర‌మంలో మిథున్ క్రీజు దాటి బంతిని వేయ‌డంతో అంపైర్ నోబాల్‌గా ప్ర‌క‌టించాడు.

Team India : ప్రపంచకప్ ఫైనల్ ఓటమిపై రాహుల్ ద్రవిడ్, రోహిత్ శర్మలను ప్ర‌శ్నించిన‌ బీసీసీఐ..!

అత‌డి పాదం క్రీజు నుంచి చాలా దూరంలో ప‌డింది. ఈ వీడియో ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్‌గా మారింది. దీన్ని చూసిన నెటీజ‌న్లు ఇలాంటి నోబాల్‌ను మా జీవితంలో ఎన్న‌డూ చూడ‌లేదంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. మొద‌ట బ్యాటింగ్ చేసిన నార్త‌ర్న్ వారియ‌ర్స్ 10 ఓవ‌ర్ల‌లో మూడు వికెట్లు కోల్పోయి 106 ప‌రుగులు చేసింది. హజ్రతుల్లా జజాయ్ (54), ఆడ‌మ్ హోస్ (24) రాణించారు. అనంత‌రం చెన్నై బ్రేవ్స్ 9.4 ఓవ‌ర్ల‌లో ఐదు వికెట్లు కోల్పోయి ల‌క్ష్యాన్ని అందుకుంది. చెన్నై బ్యాట‌ర్ల‌లో సికింద‌ర్ ర‌జా 10 బంతుల్లో 27 ప‌రుగులు, చ‌రిత్ అసంల‌క (22), స్టీఫెన్ ఎస్కినాజీ (22) లు రాణించారు.

Spirit Of Cricket : నిజ‌మైన క్రీడాస్ఫూర్తి.. జేజేలు కొడుతున్న నెటిజ‌న్లు.. ఏం జ‌రిగిందంటే..?

ట్రెండింగ్ వార్తలు