BoycottSRH : ‘మీకు దండం పెడతామయ్యా.. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను బ్యాన్ చేయండి’
సన్‌రైజర్స్ హైదరాబాద్ ను బ్యాన్ చేయాలని సోషల్ మీడియాలో (#BoycottSRH) ట్రెండ్ అవుతోంది.
- Thota Vamshi Kumar
- Updated on- March 13, 2026 / 07:11 PM IST
Boycott Sunrisers Hyderabad in IPL after Buying Pakistan spinner in the Hundred
- ది హండ్రెడ్‌లో పాక్ ఆటగాడి కొనుగోలు
- సోషల్ మీడియాలో #BoycottSRH ట్రెండింగ్
BoycottSRH : మార్చి 28 నుంచి ఐపీఎల్ 2026 ప్రారంభం కానుంది. ఈ మెగాటోర్నీకి సంబంధించిన తొలి దశ షెడ్యూల్‌ను ఇప్పటికే బీసీసీఐ వెల్లడించింది. ఆరంభ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది. ఈ మ్యాచ్‌కు బెంగళూరు ఆతిథ్యం ఇవ్వనుంది. ఇదిలా ఉంటే.. సన్‌రైజర్స్ హైదరాబాద్ ను బ్యాన్ చేయాలని సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఐపీఎల్ 2026లో ఆ జట్టును ఆడనీయకుండా కట్టడి చేయాలని పలువురు నెటిజన్లు బీసీసీఐని కోరుతున్నారు.
అసలేం జరిగిందంటే?
సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ ఓనర్ కావ్య మారన్ తీసుకున్న ఓ నిర్ణయం కారణంగానే #BoycottSRH ట్రెండింగ్ అవుతోంది. ఇంగ్లాండ్ వేదికగా జూలై 21 నుంచి ఆగస్టు 16 వరకు ది హండ్రెడ్ 2026 జరగనుంది. ఈ లీగ్‌లో సన్‌రైజర్స్ ఫ్రాంఛైజీ జట్టు అయిన సన్‌రైజర్స్ లీడ్స్ ఆడనుంది. కాగా ది హండ్రెడ్ 2026 సీజన్ కోసం గురువారం లండన్‌లో వేలాన్ని నిర్వహించారు.
Sara Tendulkar : సోదరుడి పెళ్లిలో సచిన్ కూతురు సందడి చూశారా? ఫోటోలు వైరల్..
ఈ వేలంలో పాకిస్థాన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్‌ను సన్‌రైజర్స్ లీడ్స్ జట్టు కొనుగోలు చేసింది. ఏకంగా అతడి కోసం 2.34 కోట్లు (190,000 పౌండ్లు) వెచ్చింది. ఐపీఎల్ ఫ్రాంఛైజీలకు చెందిన మిగిలిన టీమ్‌లు మాత్రం పాక్ ఆటగాళ్లను కొనుగోలు చేసే సాహసం చేయలేదు. కావ్య మారన్ మాత్రమే ఇలా చేసింది.
పాక్ ఆటగాడిని కొనుగోలు చేయడంతో ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టును బాయ్‌కాట్ చేయాలని పలువురు నెటిజన్లు కోరుతున్నారు. ఈ క్రమంలోనే #BoycottSRH ట్రెండింగ్ అవుతోంది.
Sanju Samson : సంజూ శాంసన్ ఫోటోను ఎడిట్ చేసిన శుభ్‌మన్ గిల్..! మరి అంత అసూయ పనికిరాదయ్యా..?
