Shawn Barber : 29 ఏళ్ల వయసులో మరణించిన మాజీ ప్రపంచ పోల్ వాల్ట్ ఛాంపియన్.. ఎలా చనిపోయాడంటే..?
మాజీ ప్రపంచ పోల్ వాల్ట్ ఛాంపియన్, కెనడాకు చెందిన షాన్ బార్బర్ కన్నుమూశాడు.
- Thota Vamshi Kumar
- Updated on- January 19, 2024 / 03:25 PM IST
Shawn Barber
మాజీ ప్రపంచ పోల్ వాల్ట్ ఛాంపియన్, కెనడాకు చెందిన షాన్ బార్బర్ కన్నుమూశాడు. అతడి వయస్సు 29 ఏళ్లు. బార్చర్ బుధవారం టెక్సాస్‌లోని కింగ్‌వుడ్‌లోని తన నివాసంలో మరణించినట్లు అతడి ఏజెంట్ పాల్ డోయల్ తెలియజేశాడు.
షాన్ అద్భుతమైన అథ్లెట్ మాత్రమే కాదని, ఓ మంచి మనసున్న వ్యక్తి అని అన్నాడు. ఇతరులను ఎల్లప్పుడూ గౌరవిస్తాడన్నారు. ఇంత చిన్న వయసులో అతడు మరణించడం చాలా బాధాకరం అని డోయల్ తెలిపారు. అయితే.. అతడు ఎలా మరణించాడు అన్న విషయాలను మాత్రం చెప్పలేదు. కాగా.. షాన్ బార్చర్ గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లుగా తెలుస్తోంది.
Dhoni fan : ధోనీ వీరాభిమాని ఆత్మహత్య.. తన ఇంటినే సీఎస్‌కే రంగులతో నింపిన వ్యక్తి..
5.90 మీటర్లను క్లియర్ చేయడం ద్వారా బార్చర్ 2015లో బీజింగ్‌లో జరిగిన ప్రపంచ ఛాంపియన్ షిప్ లో స్వర్ణం సాధించాడు. అదే సంవత్సరం అమెరికన్ గేమ్స్‌లో విజేతగా నిలిచాడు. రియో వేదికగా 2016లో జరిగిన ఒలింపింక్స్‌లో 10వ స్థానంలో నిలిచాడు. అతడి అత్యుత్తమ జంప్ 6 మీటర్లు. 2016 జనవరి 15న దీన్ని నమోదు చేశాడు. ఇది కెనడియన్ రికార్డుగా మిగిలిపోయింది.
అమెరికా, కెనడియన్ ద్వంద పౌరసత్వం కలిగిన అతడు 2014 గ్లాస్గోలో కాంస్యం సాధించగా, 2018 గోల్డ్ కోస్ట్ కామన్వెల్త్ గేమ్స్‌లో రజతం గెలుచుకున్నాడు.
షాన్ బార్బర్ ఇక లేడని తెలిసి.. అతడి అభిమానులతో పాటు పలువురు క్రీడాకారులు అతడి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు.
