European Cricket League T10 : బద్దకానికి బ్రాండ్ అంబాసిడర్ అంటే నువ్వే గదయ్యా..! వీడియో వైరల్
యూరోపియన్ క్రికెట్ గేమ్‌లో మాత్రం ఎక్కడలేని నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఓ బ్యాటర్ రనౌట్ అయిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
- Thota Vamshi Kumar
- Updated on- June 24, 2023 / 04:02 PM IST
European Cricket League
European Cricket League : క్రీడలు అభిమానులకు వినోదాన్ని కలిగిస్తాయి. ఆటగాళ్లు పూర్తి అంకితభావం, నైపుణ్యాలను ప్రదర్శిస్తూ జట్టును గెలిపించేందుకు తమ శాయశక్తుల కృషి చేస్తుంటారు. క్రికెట్‌లో ఎన్నో అద్భుత విన్యాసాలను చూసి ఉంటాం. అయితే.. ప్రస్తుతం జరుగుతున్న యూరోపియన్ క్రికెట్ లో మాత్రం ఎక్కడలేని నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఓ బ్యాటర్ రనౌట్ అయిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
వీడియోలో ఏం ఉందంటే..?
బౌలర్ వేసిన బంతిని బ్యాటర్ లైగ్‌సైడ్ దిశగా ఆడాడు. బంతి బౌండరీ లైన్ దగ్గకు వెలుతుంటుంది. ఫీల్డర్ అడ్డుకుని బంతిని కీపర్‌కు త్రో చేశాడు. అయిప్పటికే బ్యాటర్లు ఒక్క పరుగు పూర్తి చేశారు. రెండో పరుగు కోసం నాన్ స్ట్రైకింగ్ ఎండ్‌లో ఉన్న బ్యాటర్ పిచ్ సగం వరకు పరిగెడుతాడు. బంతిని కీపర్ అందుకోవడాన్ని గమనించినప్పటికి ఏం కాదులే అన్నట్లుగా నిదానంగా తిరిగి క్రీజు వైపు మెళ్లిగా వెలుతుంటాడు. దీన్ని గమనించిన కీపర్ బంతిని డైరెక్ట్ త్రోగా విసరడం.. అతడు క్రీజును చేరుకోకముందే బంతి వికెట్లును గిరాటేయడం జరిగిపోతుంది. దీంతో ఆ బ్యాటర్ తన నిర్లక్ష్యం కారణంగా పెవిలియన్‌కు చేరుకుంటారు.
Mitchell Starc : భార్య ఆటను చూడాలని వచ్చిన ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్.. నిరాశ తప్పలేదుగా
రనౌట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకునే అవకాశం ఉన్నప్పటికి సదరు బ్యాటర్ పరిగెత్తడానికి బద్దకించి ఔట్ కావడంపై బద్దకానికి బ్రాండ్ అంబాసిడర్ అంటూ నెటీజన్లు తమదైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు.
