IPL 2026 : శ‌నివార‌మే ఆర్‌సీబీ వ‌ర్సెస్ స‌న్‌రైజ‌ర్స్ మ్యాచ్‌.. ఇంకా సిద్ధం కాని చిన్న‌స్వామి స్టేడియం..

ఐపీఎల్ 2026 (IPL 2026 ) సీజ‌న్ శ‌నివారం (మార్చి 28) నుంచి ప్రారంభం కానుంది.

Chinnaswamy Stadium still construction site days before of IPL 2026

  • మార్చి 28 నుంచి ఐపీఎల్ 2026
  • స‌న్‌రైజ‌ర్స్ వ‌ర్సెస్ ఆర్‌సీబీ మ‌ధ్య తొలి మ్యాచ్‌
  • ఇంకా సిద్ధం కాని చిన్న‌స్వామి స్టేడియం!

IPL 2026 : ఐపీఎల్ 2026 సీజ‌న్ శ‌నివారం (మార్చి 28) నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియ‌న్ రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరుతో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టు త‌ల‌ప‌డ‌నుంది. ఈ మ్యాచ్‌కు బెంగ‌ళూరులోని చిన్న‌స్వామి స్టేడియం ఆతిథ్యం ఇవ్వ‌నుంది. అయితే.. ఈ స్టేడియం గురువారం నాటికి కూడా సిద్ధం కాలేద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. నిర్మాణ ప్రాంతంలా క‌నిపిస్తోంద‌ని అంటున్నారు.

పిచ్‌తో పాటు మైదానం సిద్ధంగా ఉన్న‌ప్ప‌టికి కూడా స్టేడియం లోప‌ల వ‌డ్రంగులు, మేస్ర్తీలు, కాంట్రాక్ట‌ర్లు ఇంకా ప‌నులు చేస్తున్న‌ట్లు ఈఎస్పీఎన్ క్రిక్ ఇన్ఫో తెలిపింది. ఇక మైదానం ప్రవేశ ద్వారాల వ‌ద్ద ప్లైవుడ్ షీట్లు, నిర్మాణ సామాగ్రి చెల్లాచెదురుగా ప‌డిన‌ట్లు పేర్కొంది.

Chennai Super Kings : ఐపీఎల్ 2026లో చెన్నై సూప‌ర్ కింగ్స్ పూర్తి షెడ్యూల్ ఇదే.. ఉప్ప‌ల్‌లో ధోనిని ఎప్పుడు చూడొచ్చంటే?

గ‌తేడాది జూన్ 4న జ‌రిగిన తొక్కిస‌లాట‌లో 11 మంది అభిమానులు ప్రాణాలు కోల్పోయి సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో మైదానంలో ప‌లు మార్పులు చేప‌ట్టారు. ఫ్యాన్ సెక్ష‌న్లు, ఎగ్జిట్ పాయింట్ల వ‌ద్ద భారీగా మార్పులు చేప‌ట్టింది క‌ర్ణాట‌క క్రికెట్ అసోసియేష‌న్‌. వాస్త‌వానికి ఈ ప‌నులు మార్చి 15 వ‌ర‌కే పూర్తి కావాల్సి ఉన్న‌ప్ప‌టికి.. మౌలిక స‌దుపాయాల మెరుగుద‌ల కోసం చేసిన మార్పుల వ‌ల్ల ఇంకా ప‌నులు జ‌రుగుతున్నాయ‌ని నివేదిక పేర్కొంది. గ‌త నాలుగు రోజులుగా నిద్ర కూడా పోకుండా కార్మికులు ప‌ని చేస్తున్న‌ట్లు తెలుస్తోంది.

ఆరంభ వేడుక‌లు ర‌ద్దు..

గ‌తేడాది విషాదం కార‌ణంగా ఈ ఏడాది ఐపీఎల్ ప్రారంభ వేడుక‌ల‌ను ర‌ద్దు చేసిన‌ట్లు బీసీసీఐ తెలిపింది. జూన్ 4న మ‌ర‌ణించిన వారి గౌర‌వార్థం బీసీసీఐ ఎలాంటి సాంస్కృతిక లేదా వినోద కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హించ‌డం లేదు అని బీసీసీఐ సెక్ర‌ట‌రీ దేవ‌జిత్ సైకియా వెల్ల‌డించారు.

RCB vs SRH : స‌న్‌రైజ‌ర్స్‌తో మ్యాచ్‌.. చ‌రిత్ర సృష్టించేందుకు సిద్ధ‌మైన భువ‌నేశ్వ‌ర్ కుమార్‌

ఇదిలా ఉంటే.. తొలి మ్యాచ్ ఆర్‌సీబీ వ‌ర్సెస్ సన్‌రైజ‌ర్స్ మ్యాచ్ టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. నిమిషాల వ్య‌వ‌ధిలోనే మొత్తం టికెట్లు అమ్ముడుపోయాయి. కాగా.. మ్యాచ్ స‌మ‌యానికి మైదానం పూర్తిగా ముస్తాబు అవుతుందా? లేదా అన్న‌ది ఉత్కంఠగా మారింది.