Luis Diaz Soccer : తండ్రి కిడ్నాప్‌.. ఆట‌తోనే విడిపించిన కొలంబియా ప్లేయ‌ర్‌.. సినిమా క‌థ‌కు ఏం త‌క్కువ కాదు..

త‌న ఆట ద్వారానే కిడ్నాప్ అయిన తండ్రిని కొలంబియా స్టార్ ప్లేయ‌ర్ లూయిస్ డియాజ్ (Luis Diaz) విడిపించాడు.

Colombian player Luis Diaz painfull story viral

Luis Diaz Soccer : ఫిఫా ప్ర‌పంచ‌క‌ప్ 2026లో కొలంబియా చిరస్మ‌ర‌ణీయ విజ‌యాన్ని అందుకుంది. ఉజ్బెకిస్తాన్‌పై 3-1 తేడాతో గెలుపొందింది. కొలంబియా విజ‌యంలో స్టార్ ఆట‌గాడు లూయిస్ డియాజ్ కీల‌క పాత్ర పోషించాడు. మ్యాచ్ అనంతరం స్టాండ్స్‌లో కూర్చున్న తన తండ్రిని చూసి అత‌డు భావోద్వేగానికి గురి అయ్యాడు. ఎన్నో కష్టాలను దాటుకుని ఇక్క‌డ‌కు చేరుకున్నాన‌ని చెప్పుకొచ్చాడు. 2022 ప్ర‌పంచ‌క‌ప్‌కు కొలంబియా అర్హత సాధించలేకపోవడం నుంచి త‌న కుటుంబం ఎదుర్కొన్న విషాద ఘటనల వరకు అనేక జ్ఞాపకాలు తన మదిలో మెదిలాయని డియాజ్ చెప్పాడు.

2023లో డియాజ్ కుటుంబం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంది. కొలంబియా-వెనిజులా సరిహద్దు ప్రాంతంలో అత‌డి త‌ల్లిదండ్రుల‌ను సాయుధ దుండ‌గులు అప‌హ‌రించారు (కిడ్నాప్‌). తల్లి సిలెనిస్ మరులాండా త్వరగానే వారి నుంచి బ‌య‌ట‌ప‌డింది. అయితే.. అత‌డి తండ్రి మానే డియాజ్ మాత్రం కిడ్నాప‌ర్ల చెర‌లోనే ఉండిపోయాడు.

Shreyanka Patil : మ‌హిళ‌ల టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో టీమ్ఇండియాకు బిగ్ షాక్.. స్టార్ ప్లేయ‌ర్ ఔట్‌..

ఆ స‌మ‌యంలో డియోజ్.. లివ‌ర్‌పూల్ క్ల‌బ్‌కు ఆడుతున్నాడు. విష‌యం తెలిసిన వెంట‌నే అత‌డు స్వ‌దేశానికి చేరుకుని త‌న తండ్రిని విడిపించ‌డానికి విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేశాడు. ఈ క్ర‌మంలో అత‌డు రెండు మ్యాచ్‌ల‌కు సైతం దూరం అయ్యాడు. అయిన‌ప్ప‌టికి ఎలాంటి ఫ‌లితం లేక‌పోయింది. దీంతో చేసేది లేక ఆట‌నే ఆయుధంగా మార్చుకున్నాడు.

తిరిగి క్ల‌బ్ త‌రుపున ఆడాడు. అయితే.. మ్యాచ్ స‌మ‌యంలో తండ్రికి స్వేచ్ఛ దొర‌కాలి అనే సందేశంతో ఉన్న ష‌ర్టుల‌ను ధ‌రించి ఆడాడు. ఈ విష‌యం అంత‌ర్జాతీయంగా చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఈ నేప‌థ్యంలో కొలంబియా ప్ర‌భుత్వం రంగంలోకి దిగింది. అత‌డి తండ్రి కిడ్నాప‌ర్ల చెర నుంచి సురక్షితంగా విడుద‌ల అయ్యాడు. దాదాపు 12 రోజుల పాటు అత‌డి తండ్రి కిడ్నాప‌ర్ల చెర‌లో ఉన్నాడు.

ఇక ప్ర‌పంచ‌క‌ప్ తొలి మ్యాచ్‌కు ముందు తన కుమారుడి జెర్సీతో ప్రార్థనలు చేస్తున్న వీడియోను మానే డియాజ్ సోషల్ మీడియాలో పంచుకోవడం కూడా వైరల్‌గా మారింది.

జర్మన్ దిగ్గజ క్లబ్ బేయర్న్ మ్యూనిచ్ తరఫున ఆడుతున్న డియాజ్.. ఉజ్బెకిస్తాన్‌పై కీలక గోల్‌తో కొలంబియాకు 2018 తర్వాత తొలి వరల్డ్ కప్ విజయాన్ని అందించాడు. తండ్రి స్టాండ్స్‌లో ఉండగా సాధించిన ఈ విజయం అత‌డి జీవితంలో ఎంతో ప్రత్యేకమని చెప్పాడు.