Glenn Phillips : గ్లెన్ ఫిలిప్స్ స్టన్నింగ్ క్యాచ్.. ఒంటి చేత్తో.. చూస్తే పూనకాలే.. వీడియో
కరేబియన్ ప్రిమియర్ లీగ్ 2026లో గ్లెన్ ఫిలిప్స్ (Glenn Phillips) స్టన్నింగ్ క్యాచ్ అందుకున్నాడు.
- Thota Vamshi Kumar
- Published on- September 1, 2026 / 01:07 PM IST
CPL 2026 Glenn Phillips pulls off amazing one handed catch
Glenn Phillips : కరేబియన్ ప్రిమియర్ లీగ్ 2026లో గ్లెన్ ఫిలిప్స్ స్టన్నింగ్ క్యాచ్ అందుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
సీపీఎల్ 2026లో భాగంగా సోమవారం ట్రినిడాడ్ వేదికగా ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్, గయానా అమెజాన్ వారియర్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ స్టార్ ఆల్‌రౌండర్ గ్లెన్ ఫిలిప్స్ బ్యాటింగ్‌లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయినప్పటికి కూడా ఫీల్డింగ్‌లో మాత్రం అదరగొట్టాడు.
వర్షం అంతరాయం కలిగించడంతో మ్యాచ్‌ను 16 ఓవర్లకు కుదించారు. తొలుత బ్యాటింగ్ చేసిన అమెజాన్ వారియర్స్ నిర్ణీత 16 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. షిమ్రాన్ హెట్‌మయర్ (111 నాటౌట్ ; 43 బంతుల్లో 8 ఫోర్లు, 9 సిక్సర్లు) మెరుపు సెంచరీ చేశాడు. ఓపెనర్ గ్లెన్ ఫిలిప్స్ నాలుగు బంతులు ఆడి డకౌట్ అయ్యాడు.
ఆ తరువాత ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్ 186 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగింది. రెండు ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 17 పరుగులు చేసింది. ఇన్నింగ్స్ మూడో ఓవర్‌ను డ్వేన్ ప్రిటోరియస్ వేశాడు. ఈ ఓవర్‌లోని తొలి బంతిని లెగ్ సైడ్ దిశగా సునీల్ నరైట్ భారీ షాట్ ఆడాడు. బంతి వేగంగా బౌండరీ వైపు వెలుతున్నట్లుగా కనిపించింది. అయితే.. డీప్ స్క్వేర్ లెగ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న గ్లెన్ ఫిలిప్స్ మాత్రం పరిగెత్తుకుంటూ వచ్చాడు. బౌండరీ ఆవల పడే బంతిని కుడి చేత్తో చక్కగా ఒడిసిపట్టుకున్నాడు.
Glenn Phillips! Stop That! 🤯🤯🤯
A crazy one-handed catch from Phillips! 🇹🇹 x 🇬🇾#CPL26 #TKRvGAW #CricketPlayedLouder #BiggestPartyInSport #OmegaXL pic.twitter.com/eFHMjjWf6U
— CPL T20 (@CPL) September 1, 2026
అతడు క్యాచ్ అందుకున్న విషయాన్ని తొలుత అతడు కూడా నమ్మలేకపోయాడు. ఆ తరువాత చిరునవ్వులు చిందించాడు. ఈ క్యాచ్ వీడియో వైరల్‌గా మారింది. ఫిలిప్స్ అద్భుత క్యాచ్ కారణంగా సునీల్ నరైన్ 1 పరుగుకే పెవిలియన్‌కు చేరాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. నైట్‌రైడర్స్ జట్టు 7 వికెట్ల నష్టానికి 172 పరుగులకే పరిమితమైంది. దీంతో గయానా జట్టు 9 పరుగుల తేడాతో విజయం సాధించింది.
