MS Dhoni : వచ్చే సీజన్ ధోని ఆడడా..? సీఎస్‌కే పోస్ట్ చేసిన వీడియోకి అర్థం అదేనా..?
సీఎస్‌కే తమ ట్విట్టర్ ఖాతాలో ఓ వీడియో పోస్ట్ చేసింది. ఆ వీడియోని తమ జట్టు నాయకుడు ధోనికి అంకితం చేసింది. నెట్టింట ఈ వీడియో వైరల్ అవుతుండగా ఇప్పుడు చాలా మందిలో ఓ సందేహం మెదులుతోంది.
- Thota Vamshi Kumar
- Published On : June 14, 2023 / 05:59 PM IST
MS Dhoni
Dhoni: భారత దిగ్గజ ఆటగాడు, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని(MS Dhoni) అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికినప్పటికి ఐపీఎల్ ఆడుతూ అభిమానులను అలరిస్తున్నాడు. ఇటీవల ముగిసిన సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings)ను విజేతగా నిలిపి టోర్నీ చరిత్రలో అత్యధికంగా ఐదు సార్లు టైటిళ్లు అందుకున్న ముంబై ఇండియన్స్ సారథి రోహిత్ శర్మ(Rohit Sharma) రికార్డును ధోని సమం చేశాడు. వచ్చే సీజన్‌లో ధోని ఆడుతాడా లేదా అన్న దానిపై స్పష్టమైన ప్రకటన అయితే ఏదీ లేదు.
అయితే.. సీఎస్‌కే తమ ట్విట్టర్ ఖాతాలో ఓ వీడియో పోస్ట్ చేసింది. ఆ వీడియోని తమ జట్టు నాయకుడు ధోనికి అంకితం చేసింది. నెట్టింట ఈ వీడియో వైరల్ అవుతుండగా ఇప్పుడు చాలా మందిలో ఓ సందేహం మెదులుతోంది. ధోని చివరి సీజన్ ఆడేశాడా..? వచ్చే సీజన్ ఆడడా..? అందుకనే సీఎస్‌కే ఇలాంటి భావోద్వేగమైన వీడియో పోస్ట్ చేసిందా అంటూ కామెంట్లు పెడుతున్నారు.
ఐపీఎల్ 16 సీజన్ ధోనికి ఆఖరిదనే ప్రచారం జరిగింది. దీంతో ధోనిని చూసేందుకు చెన్నై ఆడే ప్రతి మ్యాచ్‌కు పెద్ద సంఖ్యలో అభిమానులు తరలి వచ్చారు. ఇక మ్యాచ్ జరుగుతున్నంత సేపు ధోని నామస్మరణతోనే స్టేడియాలు మారు మోగ్రాయి. ఎవరు ఎలా అడిగినా ధోని మాత్రం తన రిటైర్‌మెంట్ పై స్పష్టమైన ప్రకటన చేయకపోగా అభిమానులను కన్‌ప్యూజ్ చేసే సమాధానాలను చెప్పాడు.
Oh Captain, My Captain! ?#WhistlePodu #Yellove ?? @msdhoni pic.twitter.com/whJeUjWUVd
— Chennai Super Kings (@ChennaiIPL) June 13, 2023
TNPL : పరమ చెత్త బౌలింగ్.. ఒక్క బంతికి 18 పరుగులు.. మాకొద్దు సామీ..!
ఐపీఎల్‌లో మోకాలి గాయంతో బాధపడిన ధోని ఫైనల్ మ్యాచ్ ముగిసిన వారం వ్యవధిలోనే ముంబైలోని కోకిలాబెన్ ఆస్పత్రిలో తన మోకాలికి శస్త్రచికిత్స చేయించుకున్నాడు. ప్రస్తుతం ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్నాడు. తనకి ఇంకో ఐపీఎల్ ఆడాలని ఉందని, అయితే అది రానున్న ఎనిమిది, తొమ్మిది నెలల్లో తన శరీరం సహకరించే దానిపై ఆధారపడి ఉంటుందని ఫైనల్ మ్యాచ్ అనంతరం ధోని చెప్పాడు. ప్రస్తుతం చెన్నై చేసిన వీడియో పోస్ట్ పై పలు అనుమానాలు కలుగుతున్నాయి.
