MIvsSRH: హైదరాబాద్ టార్గెట్ 163

ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ నిలకడైన బ్యాటింగ్‌ తీరు ప్రదర్శించారు. ఈ క్రమంలో హైదరాబాద్‌కు 163 పరుగుల టార్గెట్ ను నిర్దేశించారు. ఓపెనర్‌గా దిగిన డికాక్ మ్యాచ్ ముగిసేంతవరకూ నాటౌట్‌గా నిలిచి హాఫ్ సెంచరీకి మించిన స్కోరు నమోదు చేశాడు. హైదరాబాద్ బౌలర్లు ఖలీల్ అహ్మద్ 3వికెట్లు తీయగా, భువనేశ్వర్ 1, నబీ 1వికెట్ పడగొట్టారు.

క్వింటాన్ డికాక్(69; 58 బంతుల్లో 6ఫోర్లు, 2సిక్సులు), రోహిత్ శర్మ(24; 18బంతుల్లో 5ఫోర్లు), సూర్యకుమార్ యాదవ్(23), ఎవిన్ లూయీస్(1), హార్దిక్ పాండ్యా(18), కీరన్ పొలార్డ్(10), కృనాల్ పాండ్యా(9)పరుగులు మాత్రమే చేయగలిగారు.