FIFA World Cup 2026 : ఫ్రీ ఫ్రీ ఫ్రీ.. సబ్‌స్క్రిప్షన్ లేకుండా ఇండియాలో ఫిఫా ప్రపంచ కప్ మ్యాచ్‌లు ఇలా చూడొచ్చు..

ఫుట్‌బాల్ ప్రేమికులు ఎంత‌గానో ఎదురుచూస్తున్న ఫిఫా ప్ర‌పంచ‌క‌ప్ 2026 (FIFA World Cup 2026) మ‌రికొన్ని గంట‌ల్లో ప్రారంభం కానుంది.

Do you know how to watch FIFA World Cup matchs for free in India

  • నేటి నుంచే ఫిఫా ప్ర‌పంచ‌క‌ప్ 2026 ప్రారంభం
  • భార‌త్‌లో ప్ర‌పంచ క‌ప్ హ‌క్కుల‌ను సొంతం చేసుకున్న జీ ఎంట‌ర్‌టైన్‌మెంట్

FIFA World Cup 2026 : ఫుట్‌బాల్ ప్రేమికులు ఎంత‌గానో ఎదురుచూస్తున్న ఫిఫా ప్ర‌పంచ‌క‌ప్ 2026 మ‌రికొన్ని గంట‌ల్లో ప్రారంభం కానుంది. భార‌త జ‌ట్టు ఈ మెగాటోర్నీలో ఆడ‌కున్న‌ప్ప‌టికి కూడా మ‌న‌దేశంలో ఈ టోర్నీపై మంచి ఆస‌క్తే ఉంది. ఇక మ్యాచ్‌ల‌ను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఫుట్‌బాల్ ప్రేమికులు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. మొన్న‌టి వ‌ర‌కు మ‌న‌దేశంలో మ్యాచ్‌లు ప్ర‌సారం అవుతాయా? అనే సందిగ్ధ‌త ఉండేది.

ఈ మెగాటోర్నీలో చాలా మ్యాచ్‌లు భార‌త కాల‌మానం ప్ర‌కారం అర్థ‌రాత్రి త‌రువాత‌నే ఎక్కువగా ప్రారంభం కానున్నాయి. దీంతో ప‌లు ప్రముఖ సంస్థ‌లు.. భార‌త్‌లో ఈ టోర్నీ హ‌క్కుల‌ను కొనుగోలు చేసేందుకు ముందుకు రాలేద‌ని వార్త‌లు వ‌చ్చాయి. అయితే.. ఆఖ‌రికి మ‌న దేశంలో ఫిఫా ప్ర‌సార హ‌క్కుల‌ను జీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ సొంతం చేసుకుంది. దీంతో ప్ర‌పంచ‌క‌ప్ మ్యాచ్‌ల‌ను టీవీ, డిజిట‌ల్ వేదిక‌ల‌పై చూసేందుకు మార్గం సుగ‌మ‌మైంది.

Cricket vs Football : క్రికెట్‌కు అంద‌నంత‌ ఎత్తులో ఫుట్‌బాల్.. ప్రైజ్‌మనీలో భారీ అంతరం.. న‌క్క‌కు నాగ‌లోకానికి ఉన్న తేడా!

ఫిఫాతో జీ సంస్థ.. ప్ర‌పంచ‌క‌ప్‌తో పాటు 2034 వ‌ర‌కు జ‌ర‌గ‌నున్న మ‌రో 38 టోర్నీల ప్ర‌సారహ‌క్కుల‌ను కూడా ద‌క్కించుకోవ‌డం విశేషం. అదే స‌మ‌యంలో హక్కుల కొనుగోలుతో పాటు, తమ స్పోర్ట్స్ పోర్ట్‌ఫోలియోను బలోపేతం చేసి, విస్తరించే వ్యూహంలో భాగంగా జీ నెట్‌వర్క్ నాలుగు కొత్త స్పోర్ట్స్ ఛాన‌ళ్ల‌ను ప్రారంభించింది. అవే.. యునైట్8 స్పోర్ట్స్ 1, యునైట్8 స్పోర్ట్స్ 1 హెచ్‌డి, యునైట్8 స్పోర్ట్స్ 2, యునైట్8 స్పోర్ట్స్ 2 హెచ్‌డి ఛాన‌ళ్లు. వీటిలో ఫిఫా ప్ర‌పంచ‌క‌ప్ 2026తో పాటు రాబోయే ఫుట్ బాల్ టోర్నీల మ్యాచ్‌ల‌ను వీక్షించ‌వ‌చ్చు.

అంతేకాదండోయ్‌.. జీ 5 ఓటీటీ ద్వారా కూడా ప్ర‌పంచ‌క‌ప్ మ్యాచ్‌ల‌ను ప్ర‌త్య‌క్ష‌ప్ర‌సారం చేయ‌నుంది. ఇందుకోసం రెండు ప్ర‌త్యేక సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌లను అందుబాటులోకి తీసుకుంది. మూడు నెలల ప్లాన్ ధర రూ.799 కాగా.. వార్షిక ప్లాన్ ధర రూ.1699గా నిర్ణ‌యించింది.

ఫ్రీగా ఎలా చూడొచ్చంటే..?

జీ ఛానళ్లు లేదా జీ5 సబ్‌స్క్రిప్షన్ లేని వారికి కూడా ఓ శుభ‌వార్త ఉంది. ప్రభుత్వ రంగ ప్రసార సంస్థ ‘దూరదర్శన్’ సరికొత్త ఏర్పాట్లు చేసింది. టోర్నమెంట్‌లోని కీలకమైన కొన్ని ఎంపిక చేసిన మ్యాచ్‌లను ‘డీడీ స్పోర్ట్స్’ (DD Sports) ఛానల్‌లో ఉచితంగా ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు దూరదర్శన్ అధికారికంగా ప్రకటించింది.

Lionel Messi vs Cristiano Ronaldo : ఫుట్‌బాల్ ప్ర‌పంచ‌క‌ప్‌లో ఇదే చివ‌రిసారి? అభిమానుల క‌ల నిజ‌మ‌వుతుందా? మెస్సీ వ‌ర్సెస్ రొనాల్డో మ్యాచ్ జ‌రిగేనా?

జూన్ 11న మెక్సికో, సౌతాఫ్రికా మధ్య జరిగే ప్రారంభ మ్యాచ్ (భారత కాలమానం ప్రకారం జూన్ 12 అర్ధరాత్రి 12:30 గంటలకు) ల‌తో పాటు జూలై 9, 10, 11 తేదీల్లో జరిగే క్వార్టర్ ఫైనల్స్, జూలై 14, 15 తేదీల్లో జరిగే సెమీ ఫైనల్స్, జూలై 19న జరిగే ఫైన‌ల్ మ్యాచ్‌ల‌ను ‘డీడీ ఫ్రీ డిష్ ద్వారా వీక్షించ‌వ‌చ్చు. దీనివల్ల దేశంలోని మారుమూల ప్రాంతాల వారికి కూడా ప్రపంచకప్ వీక్షించే అవకాశం లభిస్తుంది.