Rohit Sharma : వార్నీ.. లార్డ్స్‌లో రోహిత్ శ‌ర్మ రికార్డు ఇంత ద‌రిద్రంగా ఉందా? ఇక అంతే సంగ‌తి..

టీమ్ఇండియా సీనియ‌ర్ ఆట‌గాడు రోహిత్ శ‌ర్మ (Rohit Sharma ) భ‌విష్య‌త్తు పై ప్ర‌స్తుతం క్రికెట్ వ‌ర్గాల్లో పెద్ద ఎత్తున చ‌ర్చ న‌డుస్తోంది.

Do you know Rohit Sharma record at Lords ground ahead of IND vs ENG 3rd ODI

Rohit Sharma : టీమ్ఇండియా సీనియ‌ర్ ఆట‌గాడు రోహిత్ శ‌ర్మ భ‌విష్య‌త్తు పై ప్ర‌స్తుతం క్రికెట్ వ‌ర్గాల్లో పెద్ద ఎత్తున చ‌ర్చ న‌డుస్తోంది. ఆదివారం లండ‌న్‌లోని లార్డ్స్ వేదిక‌గా ఇంగ్లాండ్‌తో జ‌ర‌గ‌నున్న ఆఖ‌రి వ‌న్డే మ్యాచే అంత‌ర్జాతీయ క్రికెట్‌లో హిట్‌మ్యాన్‌కు చివ‌రి మ్యాచ్ అని అంటున్నారు. ఈ విష‌యాన్ని బీసీసీఐ ఖండించిన‌ప్ప‌టికి కూడా అదే నిజ‌మ‌ని ప‌లువురు క్రీడా విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. సెల‌క్ట‌ర్ల వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ 2027 ప్ర‌ణాళిక‌ల్లో రోహిత్ శ‌ర్మ లేడ‌ని చెబుతున్నారు.

ఇప్ప‌టికే టెస్టులు, టీ20ల‌కు గుడ్ బై చెప్పేసిన రోహిత్ శ‌ర్మ ప్ర‌స్తుతం వ‌న్డేలు మాత్ర‌మే ఆడుతున్నాడు. వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ 2027 ఆడ‌డ‌మే త‌న ల‌క్ష్యం అని ఇప్ప‌టికే ప‌లు సంద‌ర్భాల్లో వెల్ల‌డించాడు. అయితే.. ప్ర‌స్తుత ప‌రిస్థితులు చూస్తుంటే అది అసాధ్యంలాగా క‌నిపిస్తోంది.

Virat Kohli : ఆఖ‌రి వ‌న్డే కోసం లండ‌న్‌ చేరిన భార‌త్‌.. ఇంటికెళ్లిపోయిన విరాట్ కోహ్లీ..

ఇదిలా ఉంటే.. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఆఖ‌రి వ‌న్డే మ్యాచ్ జ‌ర‌గ‌నున్న లార్డ్స్ మైదానంలో రోహిత్ శ‌ర్మ పేల‌వ రికార్డులు క‌లిగి ఉన్నాడు. ఈ చారిత్రాత్మ‌క మైదానంలో ఓ టెస్టు, రెండు వ‌న్డేలు, రెండు టీ20 మ్యాచ్‌లు క‌లిపి మొత్తంగా 5 అంత‌ర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు.

ఈ మైదానంలో రెండు వన్డేలు మాత్రమే ఆడిన రోహిత్ శ‌ర్మ ఓ మ్యాచ్‌లో డ‌కౌట్ కాగా మ‌రో మ్యాచ్‌లో 15 ప‌రుగులు మాత్ర‌మే చేశాడు. రెండు టీ20 మ్యాచ్‌లు ఆడ‌గా.. ఆ రెండూ కూడా 2009 టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లోనే ఆడాడు. వెస్టిండీస్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 5 ప‌రుగులు చేయ‌గా, ఇంగ్లాండ్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 9 ప‌రుగులు సాధించాడు. ఇక ఆడిన ఏకైక టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లో క‌లిపి 104 పరుగులు సాధించాడు.

PV Sindhu : చ‌రిత్ర సృష్టించిన తెలుగు తేజం.. జ‌పాన్ ఓపెన్‌ ఫైన‌ల్‌కు పీవీ సింధు..

ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్‌లోని రెండు మ్యాచ్‌లలోనూ రోహిత్ విఫలమయ్యాడు. తొలి మ్యాచ్‌లో 21 బంతుల్లో 11 పరుగులు, రెండవ మ్యాచ్‌లో 47 బంతుల్లో 26 పరుగులు చేశాడు. పేల‌వ ఫామ్‌తో స‌త‌మ‌తమ‌వుతున్న రోహిత్ శ‌ర్మ ఆఖ‌రి వ‌న్డేలో చెల‌రేగాల‌ని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.