Sakshi Dhoni Watch: సాక్షి ధోని వాచ్ ధర తెలిస్తే ఫ్యూజులు ఔట్.. ఓ మధ్యతరగతి కుటుంబం జీవితాంతం హ్యాపీగా..
Sakshi Dhoni Watch Price: ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో ధోని భార్య సాక్షి (Sakshi Dhoni)ధరించిన వాచ్ పైనే అందరి దృష్టి పడింది. చూసేందుకు ఎంతో సింపుల్‌గా ఉన్నప్పటికి కూడా ఇది సాధారణమైన వాచ్ కాదు.
Do you know Sakshi Dhoni Richard Mille watch price
- ముంబై మ్యాచ్‌లో ప్రత్యేక ఆకర్షణగా ధోని భార్య
- ఖరీదైన వాచ్ ధరించిన సాక్షి
Sakshi Dhoni : ఐపీఎల్ 2026 సీజన్లో మ్యాచ్‌లు ఆసక్తికరంగా సాగుతున్నాయి. ఇక మ్యాచ్‌లను ప్రత్యక్షంగా వీక్షించేందుకు మైదానాలకు అభిమానులు పోటెత్తుతున్నారు. ఇక ఆటగాళ్ల భార్యలు, కుటుంబ సభ్యులు, స్నేహితులు సైతం మ్యాచ్‌లను వీక్షించేందుకు వస్తున్నారు. వీరిలో కొందరు ప్రత్యేక ఆకర్షణగా ఉంటున్నారు. ఇక ఏప్రిల్ 23న (గురువారం) ముంబైలోని వాంఖడే మైదానంలో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్‌లు తలపడ్డాయి.
ఈ మ్యాచ్‌కు సీఎస్కే స్టార్ ప్లేయర్ ఎంఎస్ ధోని భార్య సాక్షి సింగ్ హాజరు అయ్యారు. రంగురంగుల పూల ప్రింట్లు ఉన్న క్రీమ్ రంగు సూట్‌ను ఆమె ధరించారు. మ్యాచ్ సందర్భంగా ఆమె సీఎస్కే ఆటగాళ్లను ఎంకరేజ్ చేస్తూ వచ్చారు.
ఈ సమయంలో చాలా మంది దృష్టి ఆమె ఎడమ చేతికి పెట్టుకున్న వాచ్ పై పడింది. చూసేందుకు ఎంతో సింపుల్‌గా ఉన్నప్పటికి కూడా అది సామాన్యమైన వాచ్ కాదు. రిచర్డ్ మిల్లే వాచ్. అక్షరాల దీని ధర 3 కోట్లకు పైనే ఉంటుంది.
రిస్ట్ అఫిషియోనాడో ప్రకారం.. దీని ఖరీదు 334,000 డాలర్లు అంటే భారత కరెన్సీలో దాదాపు రూ. 3.1 కోట్లు. రిచర్డ్ మిల్లే RM 67-02 వేడ్ వాన్ నీకెర్క్ .. ఓ అల్ట్రా చేతి గడియారం. దక్షిణాఫ్రికా ఒలింపిక్ స్వర్ణ పతక విజేత, 400 మీటర్ల ప్రపంచ రికార్డు హోల్టర్ అయిన వేడ్ వాన్ నీకెర్క్ గౌరవార్థం రూపొందించబడిన అత్యంత తేలికపాటి ఆటోమేటిక్ స్పోర్ట్స్ వాచ్. ఇది కార్బన్ TPT, క్వార్ట్జ్ TPT పదార్థాలతో తయారు చేశారు. దక్షిణాఫ్రికా జెండా కలర్లు అయిన ఆకుపచ్చ, పసుపు రంగులలో ఈ వాచ్‌లు లభిస్తాయి. ఎంతో తేలికైనదే కాదు, షాకింగ్ రెసిర్టెంట్ను కలిగి ఉంటుంది.
అందుకే చాలా మంది క్రీడాకారులు దీనిని ధరిస్తారు. ఇది కేవలం మణికట్టుపై అందంగా కనిపించడం కోసం కాదు, కదలిక, చెమట, నిజమైన శారీరక శ్రమను తట్టుకునేలా నిర్మించబడింది.
