IND vs SA : నేటి నుంచే దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్.. మ్యాచ్‌లను ఫ్రీగా ఎక్కడ చూడొచ్చొ తెలుసా?
భారత్ వర్సెస్ దక్షిణాప్రికా (IND vs SA) జట్ల మధ్య నేటి నుంచి వన్డే సిరీస్ ప్రారంభం కానుంది.
- Thota Vamshi Kumar
- Published On : November 30, 2025 / 11:36 AM IST
Do you know where to watch IND vs SA ODI series free watch schedule and timings
IND vs SA : దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్‌లో ఎదురైన ఘోర పరాభవానికి వన్డే సిరీస్‌లో ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోంది భారత్. ఇరు జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ నేటి నుంచి ప్రారంభం కానుంది. తొలి వన్డేకు రాంచి ఆతిథ్యం ఇస్తోంది. సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు జట్టులో చేరడంతో భారత బ్యాటింగ్ బలం పెరిగింది. అదే సమయంలో రెగ్యులర్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్, వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌లు గాయాలతో జట్టుకు దూరం కావడంతో కేఎల్ రాహుల్ సారథ్యంలో భారత్ బరిలోకి దిగనుంది.
ఇక ఇరు జట్లు (IND vs SA) ఇప్పటి వరకు ముఖాముఖిగా ఎన్ని వన్డేల్లో తలపడ్డాయి. ఎవరిది పై చేయి? వంటి విషయాలను ఓ సారి చూద్దాం..
హెడ్-టు-హెడ్..
ఇప్పటి వరకు భారత్, దక్షిణాఫ్రికా జట్లు ముఖాముఖిగా వన్డేల్లో 94 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. ఇందులో భారత్ 40 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. 51 మ్యాచ్‌ల్లో దక్షిణాఫ్రికా గెలుపొందింది. మరో మూడు మ్యాచ్‌ల్లో ఫలితం తేలలేదు. ఇక స్వదేశంలో దక్షిణాఫ్రికాతో భారత్ ఇప్పటి వరకు 32 వన్డేల్లో తలపడింది. ఇందులో భారత్ 18 మ్యాచ్‌ల్లో గెలవగా దక్షిణాఫ్రికా 14 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది.
వన్డే సిరీస్ షెడ్యూల్ ఇదే..
* తొలి వన్డే – నవంబరు 30 (రాంచి)
* రెండో వన్డే – డిసెంబరు 3 (రాయ్‌పూర్)
* మూడో వన్డే – డిసెంబరు 6 (శనివారం)
Rohit Sharma : దక్షిణాఫ్రికాతో తొలి వన్డే మ్యాచ్.. వరల్డ్ రికార్డు ముంగిట రోహిత్ శర్మ..
మ్యాచ్‌లు ఎన్నిగంటలకు ప్రారంభం అవుతాయంటే..?
ఈ మూడు వన్డే మ్యాచ్‌లు కూడా డై అండ్ నైట్ మ్యాచ్‌లు. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1.30 గంటలకు మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి.
ఎక్కడ చూడొచ్చంటే..?
టీవీల్లో మ్యాచ్‌లను స్టార్ స్పోర్ట్స్ ఛానెల్లో ప్రత్యక్ష్య ప్రసారం కానున్నాయి. ఇక ఆన్‌లైన్, మొబైల్ ఫోన్‌లలో జియో హట్‌స్టార్‌లో మ్యాచ్‌లు స్ట్రీమింగ్ కానున్నాయి. జియో సిమ్ వినియోగదారులు ప్రత్యేక రిచార్జ్ ఫ్లాన్స్ కలిగి ఉంటే.. వారికి జియో హట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా వస్తుంది. హాట్ స్టార్ సబ్‌స్క్రిప్షన్ ఉన్నవారు మ్యాచ్‌లను ఫ్రీగా చూడొచ్చు
దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌కు భారత జట్టు ఇదే..
రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, తిలక్ వర్మ, కేఎల్ రాహుల్ (కెప్టెన్), రిషభ్ పంత్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, నితీశ్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా, రుతురాజ్ గైక్వాడ్, ప్రసిద్ కృష్ణ, అర్ష్‌దీప్ సింగ్, ధ్రువ్ జురెల్.
