IND-w vs ENG-w : మహిళల టీ20 ప్రపంచకప్.. భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ వార్మప్ మ్యాచ్.. ఎక్కడ చూడొచ్చంటే?
భారత జట్టు నేడు (జూన్ 10న) ఇంగ్లాండ్ మహిళల జట్టుతో తమ చివరి వార్మప్ మ్యాచ్‌ను (IND-w vs ENG-w) ఆడనుంది.
- Thota Vamshi Kumar
- Updated on- June 10, 2026 / 09:20 AM IST
Do you know where to watch India-W vs England-W T20 World Cup warm up match live streaming
- నేడు భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ మహిళల జట్ల మధ్య వార్మప్ మ్యాచ్
- ఈ మ్యాచ్‌లో గెలిచి టీ20 ప్రపంచకప్‌కు ఆత్మవిశ్వాసంతో వెళ్లాలని భావిస్తున్న ఇరు జట్లు
Womens T20 World Cup 2026 : మహిళల టీ20 ప్రపంచకప్ 2026కి అంతా సిద్ధమైంది. ఇంగ్లాండ్ వేదికగా శుక్రవారం నుంచి ఈ మెగా టోర్నీ ప్రారంభం కానుంది. 12 జట్లు కప్పు కోసం పోటీపడనున్నాయి. న్యూజిలాండ్ డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతోంది. 12 జట్లను రెండు గ్రూపులు విభజించగా.. భారత జట్టు గ్రూప్-1లో ఉంది. టీమ్ఇండియాతో పాటు ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్, పాకిస్థాన్, దక్షిణాఫ్రికా జట్లు గ్రూప్-1లోనే ఉన్నాయి. ఇంగ్లాండ్, ఐర్లాండ్, న్యూజిలాండ్, స్కాట్లాండ్, శ్రీలంక, వెస్టిండీస్ జట్లు గ్రూప్-2లో ఉన్నాయి.
కాగా.. భారత జట్టు నేడు (జూన్ 10న) ఇంగ్లాండ్ మహిళల జట్టుతో తమ చివరి వార్మప్ మ్యాచ్‌ను ఆడనుంది. వెస్టిండీస్‌తో జరిగిన గత వార్మప్ మ్యాచ్‌లో విజయం సాధించిన భారత్.. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి ఆత్మవిశ్వాసాన్ని ప్రోదిచేసుకోవాలని భావిస్తోంది. మెగా టోర్నీకి ముందు భారత్ ఆడనున్న చివరి మ్యాచ్ కావడంతో జట్టు కూర్పు విషయంలో ఈ మ్యాచ్ ద్వారా ఓ అంచనాకు రావాలని టీమ్ మేనేజ్‌మెంట్ ఆలోచిస్తోంది.
BAN vs AUS : ఆస్ట్రేలియాపై బంగ్లాదేశ్ సంచలన విజయం.. 36 ఏళ్ల చరిత్రలో ఇది రెండోసారి..
భారత్, ఇంగ్లాండ్ మహిళల జట్ల మధ్య వార్మప్ మ్యాచ్ మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రారంభం కానుంది. కార్డిఫ్‌లోని సోఫియా గార్డెన్స్ ఈ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ మ్యాచ్ టీవీల్లో స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రత్యక్షప్రసారం కానుంది. అలాగే.. ఓటీటీలో అయితే.. జియో హాట్‌స్టార్, వైబ్‌సైట్‌లలో స్ట్రీమింగ్ కానుంది.
ఇదిలా ఉంటే.. భారత జట్టు ఇప్పటి వరకు టీ20 ప్రపంచకప్‌ను గెలవలేదు. ఈ నేపథ్యంలో తొలిసారి టీ20 ప్రపంచకప్ గెలవాలని భారత్ ఉవ్విళ్లూరుతోంది. ఈ మెగాటోర్నీలో భారత జట్టు తమ తొలి మ్యాచ్‌ను బర్మింగ్ హామ్‌లో జూన్ 14న పాకిస్థాన్‌తో ఆడనుంది.
