T20 World Cup : టీ20 ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక సిక్సర్లు కొట్టింది ఎవరో తెలుసా? టాప్-5లో ఇద్దరు టీమ్ఇండియా ప్లేయర్లు?
ఇప్పటి వరకు జరిగిన టీ20 ప్రపంచకప్‌లలో (T20 World Cup) అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాళ్లు ఎవరు? అన్నది ఓ సారి చూద్దాం.
Do you know which player hit most sixes in T20 World Cup history
T20 World Cup : టీ20ల రాకతో క్రికెట్ ఆట స్వరూపమే మారిపోయింది. దంచడమే పనిగా పెట్టుకున్నారు బ్యాటర్లు. సిక్సర్లు, ఫోర్లతో అభిమానులను అలరిస్తున్నారు. ఫిబ్రవరి 7 నుంచి టీ20 ప్రపంచకప్ 2026 ప్రారంభం కానుంది. బౌండరీల వర్షంలో ఫ్యాన్స్‌ను ముంచెత్తడానికి బ్యాటర్లు సిద్ధం అయ్యారు. ఈ క్రమంలో ఇప్పటి వరకు జరిగిన టీ20 ప్రపంచకప్‌లలో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాళ్లు ఎవరు? అన్నది ఓ సారి చూద్దాం.
2007లో టీ20 ప్రపంచకప్ ప్రారంభమైంది. ఇప్పటి వరకు తొమ్మిది ఎడిషన్లు పూర్తి అయ్యాయి. తాజాగా జరగబోయేది పదో ఎడిషన్. ఇప్పటి వరకు టీ20 ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక సిక్సర్లు కొట్టింది వెస్టిండీస్ ఆటగాడు క్రిస్‌గేల్. అతడు 31 ఇన్నింగ్స్‌ల్లోనే 63 సిక్సర్లు బాదాడు. ఆ తరువాత భారత మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ రెండో స్థానంలో ఉన్నాడు. హిట్‌మ్యాన్ 44 ఇన్నింగ్స్‌ల్లో 50 సిక్సర్లు కొట్టాడు.
MS Dhoni: బాబూ నాకది రాదు.. నేను చెయ్యను.. రూమర్స్ కి చెక్ పెట్టేసిన ధోనీ
ఇక ఈ జాబితాలో మూడో స్థానంలో ఇంగ్లాండ్ సీనియర్ ఆటగాడు జోస్ బట్లర్ ఉన్నాడు. అతడు 34 ఇన్నింగ్స్‌ల్లో 43 సిక్సర్లు బాదాడు. ఆ తరువాత నాలుగో స్థానంలో డేవిడ్ వార్నర్ (40), ఐదో స్థానంలో విరాట్ కోహ్లీ (35)లు ఉన్నారు. కాగా.. ఈ జాబితాలో ప్రస్తుత టీ20 ప్రపంచకప్ ఆడుతున్న ఏకైక బ్యాటర్ బట్లర్ మాత్రమే. ఈ క్రమంలో రోహిత్, గేల్ రికార్డులను అతడు బ్రేక్ చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
టీ20 ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక సిక్సర్లు కొట్టిన ప్లేయర్లు వీరే..
* క్రిస్ గేల్ (వెస్టిండీస్) – 31 ఇన్నింగ్స్‌ల్లో 63 సిక్సర్లు
* రోహిత్ శర్మ (భారత్) – 44 ఇన్నింగ్స్‌ల్లో 50 సిక్సర్లు
* జోస్ బట్లర్ (భారత్) – 34 ఇన్నింగ్స్‌ల్లో 43 సిక్సర్లు
* డేవిడ్ వార్నర్ (ఆస్ట్రేలియా) – 41 ఇన్నింగ్స్‌ల్లో 40 సిక్సర్లు
* విరాట్ కోహ్లీ (భారత్) – 33 ఇన్నింగ్స్‌ల్లో 35 సిక్సర్లు
* యువరాజ్ సింగ్ (భారత్) – 28 ఇన్నింగ్స్‌ల్లో 33 సిక్సర్లు
* షేన్ వాట్సన్ (ఆస్ట్రేలియా) – 22 ఇన్నింగ్స్‌ల్లో 31 సిక్సర్లు
