MS Dhoni: బాబూ నాకది రాదు.. నేను చెయ్యను.. రూమర్స్ కి చెక్ పెట్టేసిన ధోనీ
భవిష్యత్తులో కామెంటేటర్ అవతారం ఎత్తుతారా అన్న ప్రశ్న ధోనికి (MS Dhoni ) ఎదురైంది.
I am Not Good With Stats says MS Dhoni over Commentary Job
MS Dhoni : తాను ఎన్నటికి కామెంట్రీ చేయనని టీమ్ఇండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని వెల్లడించాడు. ఇందుకు ప్రధాన కారణం.. తనకు గణాంకాలను గుర్తుంచుకోవడం చాలా కష్టమైన విషయం అని తెలిపాడు. ఆటను వర్ణించడం, ప్లేయర్లను విమర్శించడం మధ్య చాలా సన్నటి రేఖ మాత్రమే ఉంటుందని చెప్పుకొచ్చాడు. ఎవరినీ ఇబ్బంది పెట్టకుండా మ్యాచ్ను కామెంట్రీ చేయడం ఓ కళ అని ధోని పేర్కొన్నాడు.
భారతదేశానికి మూడు ఐసీసీ ట్రోఫీలను అందించిన ధోని 2020లో అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. అయితే.. 44 ఏళ్ల ఈ రైట్ హ్యాండ్ బ్యాటర్ ప్రస్తుతం ఐపీఎల్ మాత్రమే ఆడుతున్నాడు. ప్రస్తుతం అతడు ఐపీఎల్ 2026 కోసం సన్నద్ధం అవుతున్నాడు.
U19 World Cup 2026 : సెమీస్ మ్యాచ్.. టాస్ గెలిచిన అఫ్గాన్.. తొలుత బౌలింగ్ చేయనున్న భారత్..
భవిష్యత్తులో కామెంటేటర్ అవతారం ఎత్తుతారా అనే ప్రశ్నఓ కార్యక్రమంలో పాల్గొన్న ధోనికి ఎదురైంది. ఈ సందర్భంగా ధోని మాట్లాడుతూ.. ‘వ్యాఖ్యానం చాలా కష్టం. ఆటను వివరించడం, ఆ ప్రక్రియలో ఆట ఆడుతున్న వ్యక్తులను విమర్శించడం మధ్య సన్నటి గీత మాత్రమే ఉంటుందని నేను భావిస్తున్నాను. మీకు ఏదైనా తప్పు అనిపిస్తే మీరు దానిని బయటకు చెబుతారు. కానీ అది ఎలా చెప్పాలనేది కూడా ఓ కళ.’ అని ధోని అన్నాడు.
ఇక ఓ జట్టు ఓడిపోతే దాని వెనుక కారణాలు ఉంటాయి. వాటిని ఎవరూ బాధపడకుండా వివరించే నైపుణ్యం మీకు ఉండాలి. అదే వ్యాఖ్యానించే కళ అని ధోని తెలిపాడు.
ఇక తనకు గణాంకాలు అంత బాగా గుర్తుండవు అని చెప్పాడు. అయితే.. గణాంకాలు తెలిసిన వారు చాలా మంది ఉన్నారన్నాడు. తన గణాంకాల గురించి ఎవరైనా తనను అడిగినా సరే అప్పుడు మౌనమే తన సమాధానం అని చెప్పాడు. అయితే.. కొందరు మాత్రం భారత క్రికెట్ జట్టు లేదా భారత ఆటగాళ్ల గురించి మాత్రమే కాకుండా ఆ యుగంలో ప్రతి ఒక్కరి గణాంకాలు గుర్తు పెట్టుకుంటారన్నాడు.
