Dwayne Bravo’s 600 T20 wickets: టీ20ల్లో 600 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా డ్వేన్ బ్రావో
వెస్టిండీస్ మాజీ క్రికెటర్ డ్వేన్ బ్రావో టీ20ల్లో అరుదైన ఘనత సాధించాడు. టీ20ల్లో 600 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా నిలిచాడు. ‘ది హండ్రెడ్’ లీగ్‌లో భాగంగా ఓవల్ ఇన్విసిబుల్స్ తో జరిగిన మ్యాచ్ లో ఈ ఘనత బ్రావో సొంతమైంది. ఈ లీగ్ లో అతడు నార్తెన్ సూపర్ ఛార్జర్స్ తరఫున ఆడాడు. గత ఏడాది బ్రావో అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అయితే, ఐపీఎల్, ది హండ్రెడ్ వంటి లీగ్‌లో ఆడుతున్నాడు. ‘ది హండ్రెడ్’ లీగ్‌లో భాగంగా ఓవల్ ఇన్విసిబుల్స్ తో జరిగిన మ్యాచ్ ద్వారా 600వ క్రికెట్ ను తన ఖాతాలో వేసుకుని ఈ ఘనత సాధించి తొలి బౌలర్ గా నిలిచాడు.
- T Venkateshwarlu
- Published On : August 12, 2022 / 08:51 PM IST
Dwayne Bravo's 600 T20 wickets
Dwayne Bravo’s 600 T20 wickets: వెస్టిండీస్ మాజీ క్రికెటర్ డ్వేన్ బ్రావో టీ20ల్లో అరుదైన ఘనత సాధించాడు. టీ20ల్లో 600 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా నిలిచాడు. ‘ది హండ్రెడ్’ లీగ్‌లో భాగంగా ఓవల్ ఇన్విసిబుల్స్ తో జరిగిన మ్యాచ్ లో ఈ ఘనత బ్రావో సొంతమైంది. ఈ లీగ్ లో అతడు నార్తెన్ సూపర్ ఛార్జర్స్ తరఫున ఆడాడు. గత ఏడాది బ్రావో అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అయితే, ఐపీఎల్, ది హండ్రెడ్ వంటి లీగ్‌లో ఆడుతున్నాడు. ‘ది హండ్రెడ్’ లీగ్‌లో భాగంగా ఓవల్ ఇన్విసిబుల్స్ తో జరిగిన మ్యాచ్ ద్వారా 600వ క్రికెట్ ను తన ఖాతాలో వేసుకుని ఈ ఘనత సాధించి తొలి బౌలర్ గా నిలిచాడు.
అతడి తర్వాత అఫ్గానిస్థాన్ లెగ్ స్పిన్నర్ రషీద్ ఖాన్ (466 వికెట్లు) ఉన్నాడు. బ్రావో మొత్తం 545 మ్యాచులు ఆడి 600 వికెట్లు తీసిన ఘనతను సొంతం చేసుకున్నాడు. అతడి యావరేజ్ 24.12గా, ఎకానమీ రేటు 8.21గా ఉంది. ఓ టీ20 మ్యాచులో 23 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీశాడు. ఇదే అతడి ఉత్తమ బౌలింగ్. బ్రావో తరువాత టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో వరుసగా రషీద్ ఖాన్ (466 వికెట్లు), వెస్టిండీస్ స్పిన్నర్ సునీల్ నరినె (457 వికెట్లు), దక్షిణ ఆఫ్రియా బౌలర్ ఇమ్రాన్ తహిర్ (451 వికెట్లు), బంగ్లాదేశ్ ఆల్ రౌండర్ షకిబ్ అల హసన్ (418 వికెట్లు) ఉన్నారు. అంతర్జాతీయ టోర్నీలతో పాటు దేశీయ లీగుల్లో తీసిన వికెట్లు మొత్తం కలిపి వీటిని లెక్కగడతారు.
