U19 World Cup 2026 : అతడి బ్యాటింగ్ చూసి తలలు పట్టుకున్నాం.. మా ఓటమికి ప్రధాన కారణం అదే.. ఇంగ్లాండ్ కెప్టెన్ థామస్ రూ
U19 World Cup 2026 : అండర్-19 వన్డే వరల్డ్ కప్ 2026లో యువ భారత్ దుమ్మురేపింది. 6వ సారి ప్రపంచ విజేతగా నిలిచింది.
- Harish Thanniru
- Updated on- February 7, 2026 / 07:56 AM IST
U19 World Cup 2026
- అండర్-19 వన్డే వరల్డ్ కప్‌లో భారత్ విజయం
- వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర బ్యాటింగ్
- అతడి బ్యాటింగ్ చూసి తలలు పట్టుకున్నామన్న ఇంగ్లాండ్ కెప్టెన్
U19 World Cup 2026 : అండర్-19 వన్డే వరల్డ్ కప్ 2026లో యువ భారత్ దుమ్మురేపింది. 6వ సారి ప్రపంచ విజేతగా నిలిచింది. హరారే వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. 100 పరుగుల తేడాతో ఇంగ్లాండ్‌ను చిత్తు చేసి జగజ్జేతగా నిలిచింది. వరుస విజయాలతో ఫైనల్‌కి చేరిన భారత్.. తుది పోరులోనూ విజయదుందుభి మోగించింది.
WPL 2026 : ఆర్సీబీ విజయోత్సవ సంబురాలు.. స్మృతి మంధాన ఆనందం చూశారా.. ఫొటోలు వైరల్..
తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు 50 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 411 పరుగులు నమోదు చేసింది. టీమిండియా చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర బ్యాటింగ్ చేశాడు. 80 బంతుల్లోనే 175 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లో ఏకంగా 15 సిక్సర్లు, 15 ఫోర్లు ఉన్నాయంటే… ఏ రేంజ్ లో బాదాడో అర్థం చేసుకోవచ్చు. కెప్టెన్ మాత్రే ఆఫ్ సెంచరీతో మెరిశాడు. 51 బంతుల్లో 53 రన్స్ చేశాడు. కుందు (40), కనిష్క్(37 నాటౌట్), త్రివేది (32), మల్హోత్రా (30) రాణించారు. భారీ పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లాండ్ జట్టు 40.2 ఓవర్లలో 311 పరుగులకు ఆలౌట్ అయింది. మ్యాచ్ అనంతరం ఇంగ్లాండ్ కెప్టెన్ థామస్ రూ మాట్లాడుతూ.. తమ ఓటమి ఆ ఒక్క ప్లేయర్ కారణమని చెప్పుకొచ్చాడు.
ఫైనల్లో ఓటమి తరువాత ఇంగ్లండ్ కెప్టెన్ థామస్ రూ మాట్లాడుతూ.. ‘వైభవ్ సూర్యవంశీని త్వరగా ఔట్ చేయకపోవడం తమ విజయావకాశాలను దెబ్బతీసింది. ఈ మ్యాచ్‌లో ఓడినా తమ బ్యాటింగ్ ను ఆస్వాదించాం. వైభవ్ లాంటి ఆటగాడు ఒక్కసారి ఊపు అందుకుంటే అడ్డుకోవటం చలా కష్టం. అతని దూకుడైన బ్యాటింగ్ చూసి మేం ఏం చేయాలో పాలుపోక తలలు పట్టుకున్నాం. అతన్ని ఔట్ చేసేందుకు అన్ని ప్రయత్నాలు చేసినా సూర్య వంశీ చేయాల్సిన విధ్వంసం చేశాడు. మ్యాచ్ కు ముందురోజు సూర్యవంశీని కట్టుడి చేసేందుకు హోం వర్క్ చేశాం. బంతుల్లో వైవిధ్యం చూపించాలని అనుకున్నాం. కానీ, గతంలో భారత్ పై మా ప్రణాళిక పనిచేసింది. ఈరోజు వైభవ్ సూర్యవంశీ అద్భుతంగా ఆడడంతో.. మా ప్రణాళికలన్నీ చిత్తయ్యాయి’. అని పేర్కొన్నాడు.
భారత్ నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించేందుకు మా బ్యాటర్లు అన్నిప్రయత్నాలు చేశారు. మా బ్యాటర్ల నుంచి కూడా గొప్పగా పోరాడారు. కాలేబ్ అసారధారణ ఇన్నింగ్స్ ఆడాడు. డాకిన్స్ కూడా విలువైన పరుగులు జోడించాడు. భారీ లక్ష్యఛేదనలో ఫలితం గురించి ఆలోచించకుండా ఆటను ఆస్వాధించాలని అనుకున్నాం. మేం విజయానికి చాలా దూరంగా నిలిచినా.. మైదానంలో మంచి సమయాన్ని గడిపాం. ఆటను బాగా ఆస్వాదించామని ఇంగ్లండ్ కెప్టెన్ థామస్ రూ చెప్పుకొచ్చాడు.
