Moeen Ali : చేతులకు స్ప్రే చేసుకుంటూ కనిపించిన ఆటగాడు.. భారీ షాక్ ఇచ్చిన ఐసీసీ
యాషెస్ సిరీస్‌లో భాగంగా ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరుగుతున్న మొదటి టెస్టులో ఇంగ్లాండ్(England), ఆస్ట్రేలియా(Australia) జట్లు నువ్వా నేనా అన్నట్లుగా పోరాడుతున్నాయి.
- Thota Vamshi Kumar
- Published On : June 18, 2023 / 08:51 PM IST
Moeen Ali
Moeen : యాషెస్ సిరీస్‌లో భాగంగా ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరుగుతున్న మొదటి టెస్టులో ఇంగ్లాండ్(England), ఆస్ట్రేలియా(Australia) జట్లు నువ్వా నేనా అన్నట్లుగా పోరాడుతున్నాయి. ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 393/8 స్కోర్ వద్ద డిక్లేర్ చేయగా ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్‌లో 386 పరుగులకు ఆలౌటైంది. దీంతో ఇంగ్లాండ్ కు 7 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. ఇదిలా ఉంటే.. ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ మొయిన్ అలీ(Moeen Ali )కి అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ICC) గట్టి షాకిచ్చింది. మ్యాచ్ ఫీజులో 25 శాతం జరిమానా విధించింది.
ENG VS AUS Ashes : ఆస్ట్రేలియా 386 ఆలౌట్.. ఇంగ్లాండ్‌కు స్వల్ప ఆధిక్యం
చేతులకు స్ప్రే చేసుకోవడంతో
ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్‌లో 89 ఓవర్ వద్ద మొయిన్ అలీ బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్నాడు. అయితే ఆ సమయంలో తన చేతులకు స్ప్రే చేస్తూ కనిపించాడు. నిబంధనల ప్రకారం క్రీమ్‌లు గానీ స్ప్రేలు గానీ వాడాలంటే ముందుగా అంపైర్ల అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అయితే.. మొయిన్ అలీ అలా చేయకపోవడంతో ఐసీసీ అతడికి జరిమానా విధించింది. మ్యాచ్ ఫీజులో 25 శాతం ఫైన్ వేయడంతో పాటు మొయిన్ అలీ ఖాతాలో ఓ డీమెరిట్ పాయింట్‌ను చేర్చింది.
Virat Kohli : విరాట్ కోహ్లి సంపాదన ఎంతో తెలుసా..? మరే క్రికెటర్‌కు కూడా సాధ్యం కాని రీతిలో
సూపర్ డెలివరీ
మొదటి ఇన్నింగ్స్‌లో అద్భుతమైన బంతితో కీలక వికెట్‌ను పడగొట్టాడు మొయిన్ అలీ. క్రీజులో పాతుకుపోయిన కామెరూన్ గ్రీన్ (38) ను క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆఫ్ సైడ్ పడిన బంతి విపరీతంగా టర్న్ అయ్యి బ్యాడ్, ప్యాడ్ల మధ్య నుంచి దూసుకువెళ్లి వికెట్లను పడగొట్టింది. బంతి అంతలా టర్న్ అవుతుందని ఊహించని గ్రీన్ బిత్తరపోయాడు. అద్భుత బంతిని వేసిన మొయిన్ అలీని భారత దిగ్గజ స్పిన్నర్ హర్భజన్ సింగ్ మెచ్చుకున్నాడు. ఈ వీడియోను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
What a beauty Moen ♠️ https://t.co/Rai7KEj4XN
— Harbhajan Turbanator (@harbhajan_singh) June 17, 2023
Suryakumar Yadav : 30 సెకన్లలో 3 రోజులు.. దేవీషాతో సూర్యకుమార్ యాదవ్
