×
Ad

 T20 World Cup 2026: శ్రీలంకపై ఇంగ్లాండ్‌ ఘన విజయం

సూపర్ 8 గ్రూప్ 2లో భాగంగా పల్లెకెలె అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచులో ఇంగ్లాండ్ 51 పరుగులతో గెలుపొందింది.

Pic: @ICC

  • సూపర్ 8 గ్రూప్ 2లో శ్రీలంక, ఇంగ్లాండ్‌ మ్యాచ్
  • ఇంగ్లాండ్ 51 పరుగుల తేడాతో విజయం
  • ఫిల్ సాల్ట్ హాఫ్ సెంచరీ

T20 World Cup 2026: టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా ఇవాళ ఇంగ్లాండ్, శ్రీలంక తలపడ్డాయి. సూపర్ 8 గ్రూప్ 2లో భాగంగా పల్లెకెలె అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచులో ఇంగ్లాండ్ 51 పరుగులతో గెలుపొందింది.

ఇంగ్లాండ్ జట్టులో ఫిల్ సాల్ట్ 62, జోస్ బట్లర్- 7 , జేకబ్ బెతెల్ – 3 , టామ్ బాంటన్ – 6 , హ్యారీ బ్రూక్ – 14 , సామ్ కరన్ – 11 , విల్ జాక్స్ – 21 , లియామ్ డాసన్ – 6 , జేమీ ఓవర్టన్ – 10 (నాటౌట్), జోఫ్రా ఆర్చర్ – 0 , ఆదిల్ రషీద్ – 1 (నాటౌట్) పరుగులు చేశారు. దీంతో ఇంగ్లాండ్ స్కోరు 146/9గా నమోదైంది.

Also Read: రేపటి నుంచి ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు.. ఒక్క నిమిషం ఆలస్యమైనా..

లక్షఛేదనలో శ్రీలంక బ్యాటర్లు తడబడ్డారు. పతుమ్ నిస్సాంక 9, కమిల్ మిశారా – 6, కుసల్ మెండిస్ – 4, పవన్ రత్నాయకే – 0, దునిత్ వెల్లాలాగే – 10, కమిందు మెండిస్ – 13, దసున్ శనక – 30, దుషాన్ హేమంత – 5, దుష్మంత చమీర – 6, మహీష్ తీక్షణ- 10, దిల్షాన్ 0 రన్స్‌ చేశారు. శ్రీలంక 95 పరుగులకే ఆలౌట్ అయింది.