Rohit Sharma: రోహిత్ శర్మ ట్విట్టర్ ఖాతా హ్యాక్? నిత్యం విచిత్రమైన ట్వీట్లు!

టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ కంటిన్యూగా ట్వీట్లు చేస్తున్నాడు, ఇది అభిమానులకు అర్థం కావట్లేదు. హిట్‌మ్యాన్‌ను ట్విట్టర్‌లో ఫాలో అయ్యేవారు 20.2 మిలియన్లు.

Rohit Sharma: టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ కంటిన్యూగా ట్వీట్లు చేస్తున్నాడు, ఇది అభిమానులకు అర్థం కావట్లేదు. హిట్‌మ్యాన్‌ను ట్విట్టర్‌లో ఫాలో అయ్యేవారు 20.2 మిలియన్లు ఉండగా.. ట్విట్టర్‌లో క్రికెట్‌కు సంబంధించిన ఫోటోలను మాత్రమే పోస్ట్‌ చేస్తూ ఉంటారు. అయితే ఇవాళ (మార్చి 1న) రోహిత్‌ శర్మ ట్విట్టర్ నుంచి వచ్చిన ట్వీట్లు అర్థం కాకపోవడం విచిత్రంగా అనిపిస్తుంది.

‘నాకు కాయిన్ టాస్‌ అంటే ఇష్టం. ముఖ్యంగా అవి నా కడుపులోకి ఎప్పుడైతే చేరతాయో..’ అంటూ రోహిత్‌ నుంచి అర్థం లేని ట్వీట్లు వచ్చాయి. ఇవి చూసిన అభిమానులు రోహిత్‌ భాయ్‌కి ఏమైంది? అంటూ కామెంట్లు చేశారు. రోహిత్ అకౌంట్‌ హ్యాక్‌ అయ్యిందేమో అనే అనుమానాన్ని అభిమానులు వ్యక్తం చేస్తున్నారు.

రోహిత్ శర్మ నుండి అలాంటి మరికొన్ని ట్వీట్లు కూడా వచ్చాయి. తేనెటీగలు గొప్ప బాక్సింగ్ బ్యాగ్‌గా పనిచేస్తాయని మరో ట్వీట్‌లో రాసుకొచ్చాడు. రోహిత్ శర్మ మరో ట్వీట్‌లో క్రికెట్ బంతులు తినదగినవి అని రాశారు. అయితేచ విరాట్ కోహ్లీని ఆటపట్టించేందుకే ఇలాంటి ట్వీట్లు చేస్తున్నారని ట్విట్టర్ వినియోగదారులు అభిప్రాయపడ్డారు.

మరికొందరు మాత్రం రోహిత్ ఎప్పుడు ట్వీట్ వేసినా ఐఫోన్ నుంచి వేస్తారు. ఇప్పుడు డెక్ నుంచి వేసినట్లుగా ఉంది కచ్చితంగా ఇది హ్యాకింగే అని అంటున్నారు.

ట్రెండింగ్ వార్తలు