FIFA World Cup 2026 : ఇటలీకి షాక్.. ఫిఫా ప్రపంచకప్ 2026కు అర్హత సాధించిన 48 జట్లు ఇవే.. ఏ గ్రూప్‌లో ఏ జట్టు ఉందంటే?
ఫిఫా ప్రపంచకప్ 2026లో (FIFA World Cup 2026) ఆడే జట్లు ఏవో తేలిపోయాయి.
FIFA World Cup 2026 here is Full list of 48 qualified teams
FIFA World Cup 2026 : ఫిఫా ప్రపంచకప్ 2026లో ఆడే జట్లు ఏవో తేలిపోయాయి. జూన్ 11 నుంచి జూలై 19 వరకు జరగనున్న ఈ మెగాటోర్నీలో మొత్తం 48 జట్లు పాల్గొంటున్నాయి. అమెరికా, మెక్సికో, కెనడా దేశాలు సంయుక్తంగా ఈ మెగాటోర్నీకి ఆతిథ్యం ఇవ్వనున్నాయి. డిఫెండింగ్ ఛాంపియన్‌గా అర్జెంటీనా జట్టు బరిలోకి దిగనుంది.
16 నగరాల్లో మొత్తం 104 మ్యాచ్‌లు జరగనున్నాయి. నాకౌట్ రౌండ్లతో సహా మొత్తం 78 మ్యాచ్‌లకు యూఎస్ఏ ఆతిథ్యం ఇవ్వనుంది. కెనడా, మెక్సికోలు చెరో 13 మ్యాచ్‌లు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. న్యూజెర్సీ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ జరగనుంది.
PBKS vs GT : ఆ బ్యాట్ మార్చాల్సిందే.. రాహుల్ తెవాటియాకు షాకిచ్చిన అంపైర్లు.. వీడియో వైరల్
వాస్తవావానికి టోర్నీ షెడ్యూల్ ప్రకటించి డ్రా లు ఖరారు చేసే సమయానికి 43 జట్లు ఖరారు కాగా.. మంగళవారం ముగిసిన UEFA క్వాలిఫైయర్స్ ద్వారా మరో నాలుగు జట్లు చోటు దక్కించుకున్నాయి.
ఇటలీకి భారీ షాక్..
నాలుగు సార్లు ఫిఫా ఛాంపియన్‌గా నిలిచిన ఇటలీ జట్టు వరుసగా మూడోసారి (2018, 2022, 2026) ప్రపంచకప్‌కు అర్హత సాధించలేకపోయింది. చివరిసారిగా ఆ జట్టు 2014 ఫిఫా ప్రపంచకప్‌లో పాల్గొంది. మంగళవారం బోస్నియాతో జరిగిన పెనాల్టీ ఘాటౌట్లో ఇటలీ 4-1 తేడాతో ఓటమిని చవిచూసింది.
చివరి జట్టుగా ఇరాక్ లేదా బొలీవియా..
ఇరాక్, బొలీవియా జట్లు ప్రస్తుతం ఇంటర్-కాన్ఫెడరేషన్ ప్లేఆఫ్‌లో తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఫీఫా ప్రపంచ కప్‌లో తుది స్థానాన్ని ఖరారు చేసుకుంటుంది. ఈ రెండు జట్లలో ఒకటి ఫ్రాన్స్, సెనెగల్, నార్వేలతో పాటు గ్రూప్ I లో బెర్తును సొంతం చేసుకుంటుంది.
ఫిఫా ప్రపంచకప్‌కు అర్హత సాధించిన జట్లు, ఏ గ్రూపులో ఏవీ ఉన్నాయంటే?
* గ్రూప్ ఎ – మెక్సికో, దక్షిణాఫ్రికా, దక్షిణ కొరియా, చెకియా
* గ్రూప్ బి – కెనడా, బోస్నియా మరియు హెర్జెగోవినా, ఖతార్, స్విట్జర్లాండ్
* గ్రూప్ సి – బ్రెజిల్, మొరాకో, హైతీ, స్కాట్లాండ్
* గ్రూప్ డి – యుఎస్ఎ, పరాగ్వే, ఆస్ట్రేలియా, టర్కీ
* గ్రూప్ ఇ – జర్మనీ, కురసావో, ఐవరీ కోస్ట్, ఈక్వెడార్
* గ్రూప్ ఎఫ్ – నెదర్లాండ్స్, జపాన్, స్వీడన్, ట్యునీషియా
* గ్రూప్ జి – బెల్జియం, ఈజిప్ట్, ఇరాన్, న్యూజిలాండ్
* గ్రూప్ హెచ్ – స్పెయిన్, కేప్ వెర్డే, సౌదీ అరేబియా, ఉరుగ్వే
* గ్రూప్ ఐ – ఫ్రాన్స్, సెనెగల్, నార్వే, ఇరాక్/బొలీవియా
* గ్రూప్ జె – అర్జెంటీనా, అల్జీరియా, ఆస్ట్రియా, జోర్డాన్
* గ్రూప్ కె – పోర్చుగల్, డిఆర్ కాంగో, ఉజ్బెకిస్తాన్, కొలంబియా
* గ్రూప్ ఎల్ – ఇంగ్లాండ్, క్రొయేషియా, ఘానా, పనామా
