Arshdeep Singh : ఒకే ఓవర్లో 11 బంతులు.. ఐపీఎల్లో చెత్త రికార్డును మూటగట్టుకున్న పంజాబ్ కింగ్స్ పేసర్
పంజాబ్ కింగ్స్ స్టార్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ (Arshdeep Singh) ఓ చెత్త రికార్డును నమోదు చేశాడు
IPL 2026 PBKS vs GT Arshdeep Singh Bowls Joint Longest Over In IPL (pic credit@ IPL)
- ఐపీఎల్లో చెత్త రికార్డు
- ఒకే ఓవర్లో 11 బంతులు వేసిన అర్ష్‌దీప్ సింగ్
Arshdeep Singh : పంజాబ్ కింగ్స్ స్టార్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ ఓ చెత్త రికార్డును నమోదు చేశాడు. ఐపీఎల్ 2026లో భాగంగా మంగళవారం గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో అర్ష్‌దీప్ సింగ్ లాంగెస్ట్ ఓవర్ వేసి అందరిని ఆశ్చర్యపరిచాడు. గుజరాత్ ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. 6 బంతులు వేయాల్సి ఉండగా ఏకంగా 11 బంతులు వేసి చెత్త రికార్డును నమోదు చేశాడు.
20వ ఓవర్లో ఏం జరిగిందంటే?
తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ 19 ఓవర్లు పూర్తి అయ్యే సరికి 6 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది. క్రీజులో షారుఖ్ ఖాన్, రాహుల్ తెవాటియా ఉన్నారు. 20వ ఓవర్‌ను అర్ష్‌దీప్ సింగ్ వేశాడు. తొలి బంతిని వైడ్‌గా వేశాడు. ఆ తరువాత వరుసగా రెండు బంతులకు పరుగులు ఏమీ రాలేదు. అయితే.. మూడో బంతికి రాహుల్ తెవాటియా ఫోర్ కొట్టడంతో అర్ష్‌దీప్ సింగ్ గతి తప్పాడు.
PBKS vs GT : అర్ష్‌దీప్ సింగ్ వచ్చి ఒక్కటే చెప్పాడు.. విజయం పై శ్రేయస్ అయ్యర్ హాట్ కామెంట్స్..
నాలుగో బంతి నో బాల్‌గా వేశాడు. ఆ తరువాత వరుసగా రెండు బంతులను వైడ్‌గా వేశాడు. నాలుగో బంతికి పరుగులు రాలేదు. ఐదో బంతికి సింగిల్ రాగా ఆఖరి బంతిని వైడ్‌గా వేశాడు. మళ్లీ ఆరో బంతి వేయగా ఈ సారి పరుగులు ఏమీ రాలేదు. ఓవర్ త్రోను కలుపుకుని మొత్తంగా ఈ ఓవర్లో 12 పరుగులు వచ్చాయి.
అర్ష్‌దీప్ సింగ్ ఒక్కడే ఏమీ కాదు..
ఐపీఎల్ చరిత్రలో ఇలా లాంగెస్ట్ ఓవర్‌ను వేసింది అర్ష్‌దీప్ సింగ్ ఒక్కడే కాదు. మరో ఐదుగురు బౌలర్లు ఉన్నారు. 2023లో మహ్మద్ సిరాజ్ ముంబై పై, 2023తో తుషార్ దేశ్ పాండే లక్నోపై, 2025లో శార్దూల్ ఠాకూర్ కేకేఆర్ పై, 2025లో ఢిల్లీ క్యాపిటల్స్ పై సందీప్ శర్మ, 2025లో గుజరాత్ టైటాన్స్ పై హార్దిక్ పాండ్యాలు కూడా ఒక ఓవర్లో 11 బంతులు వేశారు.
PBKS vs GT : ఆ ఒక్క తప్పు వల్లే పంజాబ్ పై ఓడిపోయాం.. లేదంటేనా.. శుభ్‌మన్ గిల్ కామెంట్స్..
అర్ష్‌దీప్ సింగ్ చెత్త రికార్డును నమోదు చేసినప్పటికి కూడా పంజాబ్ కింగ్స్ ఈ మ్యాచ్‌లో 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
