Lionel Messi : ఫిఫా ప్రపంచకప్ 2026లో తొలి గోల్ కొట్టగానే కన్నీటిపర్యంతమైన మెస్సీ..
అర్జెంటీనా స్టార్ ఆటగాడు లియోనెల్ మెస్సీ ( Messi) అల్జీరియాతో జరిగిన మ్యాచ్‌లో తొలి గోల్ కొట్టిన తరువాత భావోద్వేగానికి గురి అయ్యాడు.
- Thota Vamshi Kumar
- Updated on- June 17, 2026 / 07:56 PM IST
FIFA World Cup 2026 Why did Lionel Messi cry after first goal against Algeria
Lionel Messi : ఫిఫా ప్రపంచకప్ 2026లో అర్జెంటీనా ఘనంగా బోణీ కొట్టింది. గ్రూప్-జె ఓపెనింగ్ మ్యాచ్‌లో అర్జెంటీనా ఘన విజయాన్ని సాధించింది. అల్జీరియాతో జరిగిన మ్యాచ్‌లో అర్జెంటీనా 3-0 తేడాతో గెలుపొందింది. కాగా.. ఈ మ్యాచ్‌లో స్టార్ ఆటాడు అర్జెంటీనా లియోనెల్ మెస్సీ హ్యాట్రిక్ గోల్స్‌తో తన జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు. అయితే.. తొలి గోల్ చేసిన తరువాత మెస్సీ భావోద్వేగానికి గురి అయ్యాడు. కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మ్యాచ్ ముగిసిన అనంతరం మెస్సీ తాను కన్నీళ్లు పెట్టుకోవడానికి గల కారణాన్ని వెల్లడించాడు. ఆ భావోద్వేగ క్షణానికి ఫుట్‌బాల్‌తో ఎలాంటి సంబంధం లేదని వెల్లడించాడు. గత కొంతకాలంగా తాను వ్యక్తిగతంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు చెప్పాడు.
TG 20 League : టీజీ20 లీగ్.. హీరో విజయ్ దేవరకొండకు లీగల్ నోటీసులు
తాను మానసికంగా కోలుకునేలా చేయడంలో సహచర ఆటగాళ్లు, జట్టు ప్రతినిధి బృందం ఎంతో కృషి చేశారన్నాడు. వారందరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశాడు. అయితే.. తాను ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి మాత్రం మెస్సీ వెల్లడించలేదు.
పలు రికార్డులు..
- ఫిఫా ప్రపంచకప్ చరిత్రలో ఓ మ్యాచ్‌లో హ్యాట్రిక్ గోల్స్ సాధించిన అతి పెద్ద వయస్కుడిగా మెస్సీ చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలో అతడు క్రిస్టియానో రొనాల్డోను అధిగమించాడు. రొనాల్డొ 2018లో 33 ఏళ్ల 130 రోజుల వయసులో ఫిఫా ప్రపంచకప్ ఓ మ్యాచ్‌లో హ్యాట్రిక్ గోల్స్ సాధించగా మెస్సీ 38 ఏళ్ల 357 రోజుల వయసులో ఈ ఘనత అందుకున్నాడు.
- ఐదు ఫిఫా ప్రపంచకప్‌లలో గోల్ చేసిన ఆటగాళ్ల జాబితాలో మెస్సీ రెండో స్థానంలో నిలిచాడు. తొలి స్థానంలో క్రిస్టియానా రొనాల్డొ ఉన్నాడు.
- ప్రపంచ కప్‌లో వరుసగా ఐదు మ్యాచ్‌లలో గోల్ చేసిన తొలి అర్జెంటీనా ఆటగాడిగా మెస్సీ నిలిచాడు. అతను జస్ట్ ఫాంటైన్ (ఫ్రాన్స్) మరియు జైర్జిన్హో (బ్రెజిల్)ల ఆల్-టైమ్ రికార్డుకు ఒక గోల్ దూరంలో ఉన్నాడు.
