KKR : కేకేఆర్ ఆట‌గాళ్ల‌కు త‌ప్ప‌ని తిప్ప‌లు.. విమానం రెండు సార్లు దారి మ‌ళ్లింపు..

ఐపీఎల్ 17వ సీజ‌న్‌లో కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ జ‌ట్టు అద‌ర‌గొడుతోంది.

Kolkata Knight Riders : ఐపీఎల్ 17వ సీజ‌న్‌లో కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ జ‌ట్టు అద‌ర‌గొడుతోంది. ఇప్ప‌టి వ‌ర‌కు 11 మ్యాచులు ఆడిన ఆ జ‌ట్టు 8 విజ‌యాలు సాధించింది. 16 పాయింట్ల‌తో ప‌ట్టిక‌లో అగ్ర‌స్థానంలో కొన‌సాగుతోంది. ఆదివారం ల‌క్నో పై 98 ప‌రుగుల భారీ తేడాతో గెలిచిన ఆనందంలో ఉన్న కేకేఆర్ ఆట‌గాళ్లు ప్ర‌తికూల వాతావ‌ర‌ణం కార‌ణంగా ఇబ్బందుల‌ను ఎదుర్కొన్నారు. వాళ్లు ప్ర‌యాణిస్తున్న ఛార్ట‌ర్డ్ ప్లైట్ ను రెండు సార్లు దారి మ‌ళ్లించారు.

ల‌క్నో పై విజ‌యం సాధించిన కేకేఆర్ జ‌ట్టు త‌దుప‌రి మే 11న ముంబై ఇండియ‌న్స్‌తో మ్యాచ్ ఆడేందుకు ల‌క్నో నుంచి కోల్‌క‌తాకు ఛార్ట‌ర్డ్ ప్లైట్ లో సోమ‌వారం సాయంత్రి 5.45 గంట‌ల స‌మ‌యంలో బ‌య‌లు దేరింది. 7.25 గంట‌ల స‌మ‌యంలో విమానం కోల్‌క‌తాలో ల్యాండ్ కావాల్సి ఉంది. అయితే.. కోల్‌క‌తాలో కుండ‌పోత వ‌ర్షాల కార‌ణంగా ప్ర‌తికూల వాతావ‌ర‌ణం ఏర్ప‌డింది.

IPL 2024 : డ్రెస్సింగ్ రూమ్‌లో రోహిత్ శ‌ర్మ క‌న్నీళ్లు..! మైదానంలో హార్దిక్ పాండ్య న‌వ్వులే న‌వ్వులు

దీంతో వీరు ప్ర‌యాణిస్తున్న విమానాన్ని అధికారులు గువాహ‌టికి దారి మ‌ళ్లించారు. గువాహ‌టికీ చేరుకున్న కాసేటికే కోల్‌క‌తా బ‌య‌లుదేరేందుకు అనుమ‌తి ల‌భించింది. దీంతో మ‌ళ్లీ ప్లైట్ కోల్‌క‌తాకు బ‌య‌లుదేరింది. కోల్‌క‌తాలో మ‌రోసారి ల్యాండింగ్‌కు వాతావ‌ర‌ణం స‌హ‌క‌రించ‌క‌పోవ‌డంతో విమానాన్ని వార‌ణాసికి దారి మ‌ళ్లించారు.

ఇక రాత్రంతా ఆట‌గాళ్లు అక్క‌డే ఓ హోట‌ల్‌లో బ‌స చేశారు. మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం కేకేఆర్ జ‌ట్టు ఛార్ట‌ర్డ్ ప్లైట్ లో వార‌ణాసి నుంచి కోల్‌క‌తాకు బ‌య‌లు దేరనుంది. ఈ విష‌యాన్ని కేకేఆర్ త‌మ సోష‌ల్ మీడియాలో వెల్ల‌డించింది.

Rohit Sharma : ఏంట‌య్యా రోహిత్.. టీ20 ప్ర‌పంచ‌క‌ప్ ముందు ఫామ్ కోల్పోయావు.. ఇలాగైతే క‌ష్ట‌మే!

ట్రెండింగ్ వార్తలు