Hardik Pandya : ఒక్క పోస్ట్ తో సంచలనం.. MI వీడనున్న పాండ్యా.. ఆ జట్టులోకే వెళ్లబోతున్నట్లు ఫోటో..!
Hardik Pandya : ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా జట్టును వీడబోతున్నారా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. కారణం ఏంటంటే..
- Dharani Pilli
- Updated on- May 25, 2026 / 07:40 PM IST
Hardik Pandya Cryptic Post Sparks change into CSK marriage rumors
Hardik Pandya : ఐపీఎల్ 2026లో ముంబయి ఇండియన్స్ వరుస ఓటములతో దారుణంగా నిరాశపర్చింది. ఈ ఐపీఎల్ సీజన్ లో MI మొత్తం 14 మ్యాచులు ఆడగా.. కేవలం నాలుగింటిలో మాత్రమే విజయం సాధించింది. పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచింది. ఈ సీజన్ లో MI కెప్టెన్ గా మాత్రమే కాక ఆటగాడిగా కూడా హార్దిక్ పాండ్యా తీవ్రంగా నిరాశపర్చాడు. ముంబయి ఇండియన్స్ వైఫల్యాలకు పాండ్యానే कारणమంటూ ఫ్యాన్స్ తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నారు. పాండ్యా తీరు వల్లే ముంబయి ఆశించిన ఫలితాలు సాధించలేదని మండిపడుతున్నారు. ఈ క్రమంలో వచ్చే సీజన్‌కు ముందు హార్దిక్ పై MI యాజమాన్యం వేటు వేయబోతుందంటూ జోరుగా ప్రచారం మొదలైంది.
ఈ ప్రచారం జోరుగా సాగుతున్న సమయంలో హార్దిక్ పాండ్యా తన ఇన్‌స్టా స్టోరీలో పెట్టిన ఓ పోస్టు.. ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో పెను సంచలనంగా మారింది. MI వైఫల్యానికి పాండ్యానే కారణమంటూ విమర్శలు పెరుగుతున్న తరుణంలో.. అతడు వేరే జట్టులోకి వెళ్లబోతున్నాడనే వార్త MI అభిమానులను కలవరపెడుతోంది. ఈ పోస్ట్ ని బట్టి చూస్తే పాండ్యా MIని వీడి చెన్నై సూపర్ కింగ్స్ లోకి వెళ్లబోతున్నారంటూ నెటిజనులతో పాటు క్రికెట్ లవర్స్ కూడా చర్చించుకుంటున్నారు. ఇందుకు కారణం పాండ్యా చేసిన పోస్ట్.
*కేఎల్ రాహుల్ నువ్వు మామూలోడివి కాదయ్యా.. ఐపీఎల్‌లో ‘సిక్సర్ల కింగ్’ వి..
తాజాగా హార్దిక్ పాండ్యా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఒక ఫోటోను షేర్ చేశాడు. ఈ ఫోటోలో ఆయన లాప్‌టాప్ చూస్తూ ఉండగా, పక్కనే ఉన్న మొబైల్ స్క్రీన్ వెలుగుతూ కనిపిస్తుంది. అలానే ఆ ఫోన్ స్క్రీన్ మీద టైం కరెక్ట్ గా.. “07:07” అని చూపిస్తోంది. ఈ ఫోటో షేర్ చేసిన కాసేపటికే విపరీతంగా వైరల్ అవ్వడమే కాక పాండ్యా MIని వీడి CSK జట్టులోకి వెళ్లబోతున్నారనే ప్రచారం తెర మీదికి వచ్చింది.
hardik
పాండ్యా పోస్ట్ చేసిన ఫోటోను గమనించిన నెటిజన్లు, క్రికెట్ విశ్లేషకులు.. ఈ పోస్ట్ వెనక పెద్ద కారణమే ఉందంటున్నారు. क्रिकेटలో ‘7’ నంబర్ అనగానే ప్రతి ఒక్కరికీ గుర్తుకు వచ్చేది.. చెన్నై సూపర్ కింగ్స్ (CSK) దిగ్గజం ఎంఎస్ ధోనీ. దీంతో హార్దిక్ పాండ్యా వచ్చే సీజన్‌లో MIని వీడి, చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో చేరబోతున్నారనే సరికొత్త చర్చ తెర మీదికి వచ్చింది.
*హార్దిక్ పాండ్యాకు అన్నీ ఇచ్చాము.. కానీ.. కీరన్ పొలార్డ్ సంచలన వ్యాఖ్యలు..
అయితే కొందరు మాత్రం ఈ పోస్ట్ హార్దిక్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాన్ని సూచిస్తోంది అంటున్నారు. పాండ్యా పోస్ట్ చేసిన ఫోటోలో ఉన్న నోట్‌బుక్, పెన్ పింక్ కలర్‌లో ఉండటం, అలాగే ‘07:07’ సమయం ఉండటాన్ని బట్టి ఆయన రాబోయే జూలై 7వ తేదీన (7వ నెల, 7వ తేదీ) పెళ్లి చేసుకోబోతున్నారంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. జూలై 7న పాండ్యా.. ప్రముఖ మోడల్ మహీకా శర్మను రెండో వివాహం చేసుకోబోతున్నారనే వార్తలు వైరల్ అవుతున్నాయి.
