Hardik Pandya : వరల్డ్ కప్ నుంచి తప్పుకున్న తరువాత హార్దిక్ పాండ్యా భావోద్వేగ ట్వీట్.. ఏమన్నాడంటే
వరల్డ్ కప్ లోని మిగిలిన మ్యాచ్ లకు దూరం కావటంతో హార్ధిక్ పాండ్య ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ మేరకు ట్విటర్ లో భావోద్వేగ ట్వీట్ చేశాడు. టోర్నీలోని మిగతా మ్యాచ్ కు దూరమవుతున్నానే వాస్తవాన్ని..
- Harish Thanniru
- Updated on- November 4, 2023 / 02:20 PM IST
Hardik Pandya
ODI World Cup 2023 : టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య గాయం నుంచి కోలుకోలేక పోవడంతో స్వదేశంలో జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ లో మిగిలిన మ్యాచ్ లకు దూరమయ్యాడు. పూణెలో బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో బౌలింగ్ చేస్తున్నప్పుడు ఎడమ చీలమండ గాయంతో హార్దిక్ పాండ్య గాయపడిన విషయం తెలిసిందే. ఆ తరువాత భారత్ ఆడిన మ్యాచ్ లకు హార్దిక్ దూరమయ్యాడు. బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో గాయం నుంచి అతను కోలుకుంటున్నాడని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. కానీ, హార్దిక్ గాయం ఇప్పట్లో తగ్గే అవకాశం లేకపోవటంతో టీం మేనేజ్మెంట్ అతడికి విశ్రాంతి ఇవ్వాలని నిర్ణయించింది. దీంతో టోర్నీలోని మిగిలిన మ్యాచ్ లకు హార్దిక్ దూరమయ్యాడు.
Also Read : Rachin Ravindra: సత్తా చాటిన కివీస్ ఓపెనర్.. రచిన్ రవీంద్ర ఖాతాలో మరో ఘనత
వరల్డ్ కప్ లోని మిగిలిన మ్యాచ్ లకు దూరం కావటంతో హార్ధిక్ పాండ్య ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ మేరకు ట్విటర్ లో భావోద్వేగ ట్వీట్ చేశాడు. టోర్నీలోని మిగతా మ్యాచ్ కు దూరమవుతున్నానే వాస్తవాన్ని జీర్ణించుకోవటం చాలా కష్టంగా ఉంది. అయితే, ఎల్లవేళలా జట్టుతో పాటు ఉంటా. ప్రతి బంతికి, ప్రతి మ్యాచ్ కు ఆటగాళ్లలో జోష్ నింపడానికి ముందుంటా. ఈ అద్భుత జర్నీలో మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు.. ఈ జట్టు నాకెంతో ప్రత్యకమైంది. తప్పకుండా మిమ్మల్ని గర్వపడేలా చేస్తుందని ఆశిస్తున్నా అంటూ పాండ్య ట్వీట్ లో పేర్కొన్నాడు.
