Hardik Pandya : హార్దిక్ పాండ్యా మెడపై వేలాడుతున్న కత్తి! కెప్టెన్సీ పోవడం ఖాయమే! ఆటగాడిగా కూడా చోటులేదా?
హార్దిక్ పాండ్యా (Hardik Pandya) నాయకత్వంలో ముంబై జట్టు ఐపీఎల్ 2026లో లీగ్ దశ నుంచే నిష్ర్కమించింది.
- Thota Vamshi Kumar
- Updated on- May 29, 2026 / 12:03 PM IST
Hardik Pandya is set to lose his Mumbai Indians captaincy reports (pic credit@ipl)
- ఐపీఎల్ 2026 సీజన్‌లో పేలవ ప్రదర్శన చేసిన ముంబై
- తీవ్ర అసంతృప్తిలో టీమ్ మేనేజ్‌మెంట్!
- హార్దిక్ పాండ్యా కెప్టెన్సీకి ముప్పు!
Hardik Pandya : ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్ పేలవ ప్రదర్శన చేసింది. హార్దిక్ పాండ్యా నాయకత్వంలో ముంబై జట్టు లీగ్ దశ నుంచే నిష్ర్కమించింది. లీగ్ దశలో 14 మ్యాచ్‌లు ఆడగా నాలుగు అంటే నాలుగే మ్యాచ్‌ల్లో ముంబై విజయం సాధించింది. 10 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. తొమ్మిదో స్థానంతో సీజన్‌ను ముగించింది. ఈ సీజన్‌లో ఘోర ప్రదర్శన చేయడంలో జట్టులో మార్పులు చేయాలని జట్టు మేనేజ్‌మెంట్ భావిస్తోంది. అందులో భాగంగా కెప్టెన్సీ నుంచి హార్దిక్ పాండ్యాను తప్పించనున్నట్లు సమాచారం.
ఐపీఎల్ 2024 సీజన్‌కు ముందు రోహిత్ శర్మ స్థానంలో ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా హార్దిక్ బాధ్యతలు చేపట్టాడు. జట్టులోని సీనియర్ ఆటగాళ్లతో హార్దిక్ పాండ్యాకు పడడం లేదని వార్తలు వచ్చాయి. ఈ సమయంలోనే సొంత ప్రేక్షకుల నుంచే హార్దిక్‌కు విమర్శలు ఎదురుఅయ్యాయి. అదే సమయంలో ఈ సీజన్‌లో ముంబై జట్టు అట్టడుగు స్థానంలో నిలిచింది. అయినప్పటికి హార్దిక్‌కు మేనేజ్‌మెంట్ మద్దతు ఇచ్చింది. ఐపీఎల్ 2025లో ముంబై జట్టు ప్లేఆఫ్స్‌కు చేరుకుంది. దీంతో అంతా చక్కబడిందని అనుకున్నారు.
రోహిత్ శర్మ, జస్‌ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ వంటి భారత జట్టులోని రెగ్యులర్ ఆటగాళ్లు జట్టులో ఉండడంతో ఐపీఎల్ 2026లో ముంబై ఆధిపత్యం చెలాయిస్తుందని అంతా భావించారు. అయితే.. అంచనాలు తలక్రిందులు అయ్యాయి.. తొమ్మిదో స్థానంలో నిలవడంతో మేనేజ్‌మెంట్ అసంతృప్తిలో ఉన్నట్లు ఆంగ్లమీడియాలో వార్తలు వస్తున్నాయి.
ఆటగాడిగా కూడా..
కెప్టెన్సీ పోవడం ఎలాగూ ఖాయమని, అయితే.. ఆటగాడిగానైనా అతడు ముంబై జట్టులో కొనసాగుతాడా? లేదా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. త్వరలో జరగబోయే ఫ్రాంచైజీ అంతర్గత సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అదే సమయంలో సీనియర్ల విషయంలోనూ కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. ఏదీ ఏమైనప్పటికి కూడా జట్టులో ముంబై జట్టులో భారీ మార్పులు చోటు చేసుకోవడం ఖాయమని తెలుస్తోంది.
