Hardik Pandya : ఇదేం క‌ర్మ‌రా సామీ.. మ‌ళ్లీ గాయ‌ప‌డిన హార్దిక్ పాండ్యా! అఫ్గాన్‌తో టీ20 సిరీస్‌కు దూరం

గాయం నుంచి కోలుకుని రీ ఎంట్రీ ఇవ్వాల‌ని భావిస్తున్న టీమ్ఇండియా స్టార్ ఆల్ రౌండ‌ర్ హార్దిక్ పాండ్యాకు (Hardik Pandya) భారీ షాక్ త‌గిలింది.

Hardik Pandya suffers fresh injury doubtful for Afghanistan T20Is

Hardik Pandya : గాయం నుంచి కోలుకుని రీ ఎంట్రీ ఇవ్వాల‌ని భావిస్తున్న టీమ్ఇండియా స్టార్ ఆల్ రౌండ‌ర్ హార్దిక్ పాండ్యాకు భారీ షాక్ త‌గిలింది. మ‌ళ్లీ అత‌డు గాయ‌ప‌డిన‌ట్లు తెలుస్తోంది. దీంతో అఫ్గానిస్థాన్‌తో సెప్టెంబ‌ర్ 13 నుంచి ప్రారంభం కానున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు అత‌డు దూరం అయ్యే అవ‌కాశం ఉన్న‌ట్లు స‌మాచారం.

తొడ కండ‌రాల గాయంతో బాధ‌ప‌డిన హార్దిక్ పాండ్యా గ‌త కొన్ని నెల‌లుగా బెంగ‌ళూరులోని బీసీసీఐ సెంట‌ర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లో పున‌రావాసంలో ఉన్నాడు. గాయం నుంచి కోలుకుని ఇటీవ‌లే అత‌డు పూర్తి స్థాయి ఫిట్‌నెస్ సాధించాడ‌ని సీవోఈ వ‌ర్గాలు వెల్ల‌డించ‌డంతో అత‌డు అఫ్గాన్‌తో టీ20 సిరీస్ ద్వారా అంత‌ర్జాతీయ క్రికెట్‌లో రీ ఎంట్రీ ఇస్తాడ‌ని అంతా భావించారు.

Lionel Messi : ఫ్యామిలీతో మెస్సీ.. రేర్ ఫోటోలు వైర‌ల్‌..

అయితే.. లేటెస్టుగా ప్రాక్టీస్ స‌మ‌యంలో హార్దిక్ కాలికి గాయ‌మైన‌ట్లు ఆంగ్ల మీడియాలో వార్త‌లు వ‌స్తున్నాయి. దీంతో అత‌డు అఫ్గాన్‌తో సిరీస్‌కు దూరం కానున్నాడ‌ని స‌ద‌రు వార్త‌ల స‌మాచారం. పాండ్యా చివ‌రి సారిగా టీమ్ఇండియా త‌రుపున 2026 టీ20 ప్ర‌పంచ‌క‌ప్ ఫైన‌ల్ మ్యాచ్ ఆడాడు.

అఫ్గాన్‌తో సిరీస్‌కు ఈ వారంలో సెల‌క్ట‌ర్లు జ‌ట్లును ఎంపిక చేయ‌నున్నారు. భార‌త్‌, అఫ్గాన్ జ‌ట్ల మ‌ధ్య జ‌ర‌గ‌నున్న‌ మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం ఆతిథ్యం ఇవ్వ‌నుంది.

భార‌త్, అఫ్గాన్ టీ20 సిరీస్ షెడ్యూల్ ఇదే..

* తొలి టీ20 మ్యాచ్ – సెప్టెంబ‌ర్ 13న‌
* రెండో టీ20 మ్యాచ్ – సెప్టెంబ‌ర్ 15న‌
* మూడో టీ20 మ్యాచ్ – సెప్టెంబ‌ర్ 17న‌