Team India : ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్ నుంచి హార్దిక్ ఔట్! కోహ్లీ భవిష్యత్ తేలేది ఆరోజే?
ఇంగ్లాండ్‌తో జూలై 14 నుంచి భారత జట్టు (Team India) మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆడనుంది,
- Thota Vamshi Kumar
- Updated on- June 20, 2026 / 02:34 PM IST
Hardik ruled out of ODI series vs England Kohli to undergo fitness test
Team India : టీమ్ఇండియా సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యాలు గాయాలతో అఫ్గానిస్థాన్‌తో వన్డే సిరీస్‌కు దూరం అయ్యారు. ఇక వీరు ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్‌లోనైనా ఆడతారా? లేదా? అన్న సందేహాలు ఫ్యాన్స్‌లో నెలకొన్నాయి. జూలై 14 నుంచి భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ప్రారంభం కానుంది.
టీమ్ఇండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఇంగ్లాండ్ సిరీస్‌కు దూరం కానున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ సమయంలో అతడికి తగిలిన గాయం నుంచి ఇంకా పూర్తిగా కోలుకోలేదని సమాచారం. అతడు కోలుకునేందుకు ఇంకా చాలా సమయం పట్టే అవకాశం ఉందని అంటున్నారు. అతడి స్థానంలో మరో ఆటగాడిని ఎంపిక చేసే పనిలో సెలక్టర్లు ఉన్నారు.
FIFA World Cup 2026 : ఫిఫా ప్రపంచకప్ చరిత్రలో ఇదే తొలిసారి.. నోరు మూసుకున్నందుకు రెడ్ కార్డు..
ఇక విరాట్ కోహ్లీ విషయానికి వస్తే.. జూన్ 26న ఇంగ్లాండ్‌లో అతడు ఫిట్‌నెస్ పరీక్షకు హాజరుకానున్నారు. ఫిట్‌నెస్ టెస్టులో పాసైతే కోహ్లీ ఇంగ్లాండ్ సిరీస్‌లో ఆడతారని, లేదంటే అతడు కూడా ఇంగ్లాండ్ సిరీస్‌కు దూరం అవ్వడం ఖాయమని ఆంగ్ల మీడియాలో వార్తలు వస్తున్నాయి.
ఇదిలా ఉండగా.. 2027 వన్డే ప్రపంచకప్‌కు సంబంధించిన భారత జట్టు ప్రణాళికలపై బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా స్పందించారు. జట్టు భవిష్యత్ వ్యూహాలపై చర్చలు నిరంతర ప్రక్రియలో భాగమని, వాటిని బహిరంగంగా వెల్లడించడం సరైంది కాదని ఆయన చెప్పుకొచ్చారు. సెలెక్టర్లు, కోచ్‌లు, సపోర్ట్ స్టాఫ్, ఆటగాళ్లు కలిసి నిర్ణయాలు తీసుకుంటారని స్పష్టం చేశారు. రోహిత్, కోహ్లీ భవిష్యత్‌పై ఊహాగానాలు కొనసాగుతున్నప్పటికీ, ఈ అంశాలపై బోర్డు అధికారికంగా ఎలాంటి సమాచారం వెల్లడించలేదు.
