Harshit Rana has been ruled out of the T20 World Cup 2026 Mohammed Siraj in
T20 World Cup 2026 : టీమ్ఇండియా పేసర్ హర్షిత్ రాణా టీ20 ప్రపంచకప్ 2026 నుంచి తప్పుకున్నాడు. ఫిబ్రవరి 4న నవీ ముంబై వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో హర్షిత్ మోకాలి గాయంతో బాధపడ్డాడు. ఈ మ్యాచ్‌లో అతడు ఒక్క ఓవర్ మాత్రమే బౌలింగ్ చేసి మైదానం నుంచి బయటికి వెళ్లాడు. ఆ తరువాత గాయం తీవ్రత తెలుసుకునేందుకు అతడికి స్కానింగ్ లు నిర్వహించారు.
గాయం తీవ్రమైనది కావడంతో అతడు టీ20 ప్రపంచకప్ 2026 నుంచి తప్పుకున్నాడు. ఈ విషయాన్ని బీసీసీఐ వెల్లడించింది. అతడి స్థానంలో మహ్మద్ సిరాజ్‌ను ఎంపిక చేసినట్లు ఓ ప్రకటనలో తెలిపింది.
U19 World Cup 2026 : అండర్ 19 విజేతగా నిలిచిన భారత్‌కు ప్రైజ్‌మనీగా ఒక్క రూపాయి ఇవ్వని ఐసీసీ..
🚨 News 🚨
Harshit Rana ruled out of ICC Men’s T20 World Cup 2026, Mohd. Siraj named as replacement.
Details 🔽 | #TeamIndia | #MenInBlue | #T20WorldCup https://t.co/Ml6TxXELgP
— BCCI (@BCCI) February 6, 2026
‘2026 ఫిబ్రవరి 4న నవీ ముంబైలో దక్షిణాఫ్రికాతో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో మోకాలి గాయం కారణంగా భారత పేసర్ హర్షిత్ రాణా రాబోయే ఐసిసి పురుషుల టి20 ప్రపంచ కప్ 2026 నుండి తప్పుకున్నాడు. నిపుణుడితో సంప్రదింపులు, తదుపరి స్కాన్‌ల తర్వాత, బీసీసీఐ వైద్య బృందం అతను టోర్నమెంట్‌లో పాల్గొనడానికి అనర్హుడని భావించింది. జట్టు యాజమాన్యం అతను త్వరగా కోలుకోవాలని కోరుకుంటుంది. అతడి స్థానంలో సిరాజ్ జట్టులో చేరనున్నారు.’ అని బీసీసీఐ తెలిపింది.
టీ20 ప్రపంచకప్ 2026కు నవీకరించిన భారత జట్టు ఇదే..
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివం దుబే, అక్షర్ పటేల్ (వైస్‌కెప్టెన్), రింకూ సింగ్, జస్‌ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, వాషింగ్టన్ సుందర్, సిరాజ్.