Pro Kabaddi League 2024 : సెమీస్‌కు హర్యానా స్టీలర్స్.. గుజరాత్ జెయింట్స్‌కు ఘోర పరాభవం
ప్రొ కబడ్డీ లీగ్ సీజన్ 10 ఆఖరి దశకు చేరుకుంది.
- Thota Vamshi Kumar
- Published On : February 27, 2024 / 03:05 PM IST
Pro Kabaddi League 2024
Pro Kabaddi League : ప్రొ కబడ్డీ లీగ్ సీజన్ 10 ఆఖరి దశకు చేరుకుంది. హర్యానా స్టీలర్స్ సెమీఫైనల్లోకి దూసుకువెళ్లింది. ఎలిమినేటర్ 2 మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్ పై విజయం సాధించింది. జిఎంసీ బాలయోగి ఇండోర్ స్టేడియంలో సోమవారం గుజరాత్, హర్యానాల జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. హర్యానా స్టీలర్స్ 42-25తో గుజరాత్ పై విజయం సాధించి సెమీ ఫైనల్‌లో అడుగుపెట్టింది. హర్యానాకు ప్రాతినిధ్యం వహిస్తున్న వినయ్ రైడింగ్‌లో 12 పాయింట్ల సాధించగా, డిఫెన్స్‌లో మోహిత్ ఏడు ట్యాకిల్స్ పాయింట్లతో అదుర్స్ అనిపించారు.
ఎలిమినేటర్ 2లో ఓడిపోవడంతో ఈ సీజన్ టైటిల్ రేసు నుంచి గుజరాత్ జెయింట్స్ నిష్ర్కమించింది. కీలక మ్యాచ్‌లో గుజరాత్ తడబడింది. ఏ దశలోనూ అంచనాలను అందుకోలేదు. కూతలో ఆ జట్టు పోరాడినా ఢిఫెన్స్ లో చేతులెత్తేసింది. రెయిడింగ్‌లో గుజరాత్ 16 పాయింట్లు, హర్యానా 19 పాయింట్లు సాధించాయి. డిఫెన్స్‌లో స్టీలర్స్ షో సాగింది. గుజరాత్ జెయింట్స్‌ను మూడు సార్లు ఆలౌట్ చేసింది. డిఫెన్స్‌లో హర్యానా 14 పాయింట్లు సాధించగా.. గుజరాత్ కేవలం ఐదు పాయింట్లకే పరిమితమైంది.
Jan Nicol Loftie Eaton : టీ20 క్రికెట్‌లో పెను విధ్వంసం.. చరిత్ర సృష్టించిన నమీబియా ఆటగాడు
మ్యాచ్ ఆరంభం రసవత్తరంగా మొదలైంది. పాయింట్ల కోసం ఇరు జట్లు ప్రథమార్థంలో హోరాహోరీగా పోటీ పడ్డాయి. పర్తీక్ దహియ, రాకేశ్ సుంగ్రోయ సోను జగ్లాన్‌లు గుజరాత్ జెయింట్స్ తరఫున మెరిశారు. వినయ్, శివం పటారె, మోహిత్‌లు హర్యానా తరుపున రాణించారు. ప్రథమార్థం ముగిసే సరికి హర్యానా 21-16తో ఆధిక్యంలోకి ఉంది.
Rohit Sharma : ఆ ఘనత సాధించిన తొలి కెప్టెన్ రోహిత్ శర్మనే..
రెండో అర్థభాగంలో గుజరాత్ పూర్తిగా చేతులెత్తేసింది. హర్యానా ఆటగాడు వినయ్ వరుసగా రైడ్ పాయింట్లు తీసుకురాగా, మోహిత్ సూపర్ ట్యాకిల్స్‌తో రాణించాడు. ఇక అప్పటి నుంచి గుజరాత్ ఏ దశలోనూ పుంజుకోలేదు. భారీ ఆధిక్యాన్ని సాధించిన హర్యానా విజేతగా నిలిచి సెమీ ఫైనల్‌కు దూసుకువెళ్లింది. గురువారం జరగనున్న సెమీఫైనల్‌లో హర్యానా జట్టు డిఫెండింగ్ చాంపియన్ జైపూర్ పింక్ పాంథర్స్‌తో తలపడనుంది.
