HCA Elections: అర్శనపల్లి జగన్మోహన్ రావుకి పోటీగా శివాలాల్ యాదవ్, హర్షద్ అయూబ్ ప్యానల్
అధ్యక్షుడిగా అమర్ నాథ్ పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. వైస్ ప్రసిడెంట్ గా జీ శ్రీనివాస్..
- T Venkateshwarlu
- Published On : October 16, 2023 / 03:18 PM IST
HCA Elections 2023
HCA Elections-2023: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ.. ఇందులో పోటీ చేస్తున్న ప్యానెళ్లు ప్రచారం మొదలుపెట్టాయి. ఈ నెల 20న హెచ్‌సీఏ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ, ట్రెజరర్, ఈసీ సభ్యులను ఎన్నుకుంటారు. హెచ్‌సీఏ ఎన్నికల్లో పోటీకి ఇప్పటికే నామినేషన్లు పూర్తయ్యాయి.
అర్శనపల్లి జగన్మోహన్ రావుకి చెందిన ‘యునైటెడ్ మెంబర్స్ ఆఫ్ హెచ్‌సీఏ’ ప్యానెల్ ఈ నెల 13న నామినేషన్ దాఖలు చేసింది. ఆ ప్యానెల్ కు పోటీగా శివాలాల్ యాదవ్, హర్షద్ అయూబ్‌కు చెందిన ప్యానల్ పోటీ చేస్తోంది. వారిద్దరు ఇవాళ పలు వివరాలు తెలిపారు. క్రికెట్ ఫస్ట్ అనే పేరుతో తమ ప్యానెల్ పోటీ చేస్తుందని అన్నారు.
అధ్యక్షుడిగా అమర్ నాథ్ పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. వైస్ ప్రసిడెంట్ గా జీ శ్రీనివాస్, ట్రెజరర్‌గా సంజీవ్ రెడ్డి, జాయింట్ సెక్రటరీగా చిట్టి శ్రీధర్, కౌన్సిలర్‌గా సునీల్ అగర్వాల్ పోటీకి దిగుతున్నట్లు వివరించారు. అవినీతితో కూరుకు పోయిన హెచ్‌సీఏను ప్రక్షాళన చేస్తామని అన్నారు. యంగ్ ప్లేయర్స్ కు అవకాశాలు కల్పిస్తామని చెప్పారు.
అవినీతి, రాజకీయ పలుకుబడి లేకుండా అర్హత కలిగిన క్రీడాకారులకు అవకాశాలు ఇస్తామన్నారు. జిల్లాస్థాయి క్రీడాకారులకు న్యాయం చేస్తామని చెప్పారు. స్టేడియాల అభివృద్ధి కృషి చేస్తామని, సెలక్షన్ పారదర్శకంగా జరిగే విధంగా పటిష్ఠమైన చర్యలు తీసుకుంటామని అన్నారు.
Rashid Khan : ఢిల్లీ ప్రజల పై అఫ్గానిస్థాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ కామెంట్స్.. వైరల్
