Virat Kohli: ‘కోహ్లీ నువ్వు రోజూ బర్త్ డే జరుపుకో’
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ 33వ బర్త్ డే.. రోజునే స్కాట్లాండ్ తో మ్యాచ్ జరిగింది. అదే రోజు కోహ్లీ టాస్ గెలవడం నెట్టింట సందడిగా మారింది. విరాట్ కోహ్లీకి టీ20 వరల్డ్ కప్ 2021వ..
- Subhan Ali Shaik
- Published On : November 7, 2021 / 11:23 AM IST
Virat Kohli
Virat Kohli: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ 33వ బర్త్ డే.. రోజునే స్కాట్లాండ్ తో మ్యాచ్ జరిగింది. అదే రోజు కోహ్లీ టాస్ గెలవడం నెట్టింట సందడిగా మారింది. విరాట్ కోహ్లీకి టీ20 వరల్డ్ కప్ 2021వ సీజన్లో టాస్ గురించి పాజిటివ్ రిజల్ట్స్ లేవు. ఇప్పటివరకూ జరిగిన నాలుగు మ్యాచ్ లలో గెలిచింది ఒక్కటే.
అతని బర్త్ డే రోజునే జరిగిన మ్యాచ్ టాస్ గెలవడంతో.. తొలి మ్యాచ్ కూడా పుట్టిన రోజునాడే జరిగితే బాగుండేది అంటున్నారు. ఇక ఈ మ్యాచ్ ఆసాంతం టీమిండియాదే పైచేయిగా కనిపించింది.
‘మేం ముందుగా బౌలింగ్ చేస్తున్నాం. మంచు వాతావరణం ఎక్కువ ప్రభావం కనిపించనుంది. వాళ్లను పరుగులు ఎక్కువగా చేయకుండా కట్టడి చేయడానికి ప్రయత్నిస్తాం. నా పుట్టిన రోజునాడు టాస్ గెలవడం తొలిసారి. నా పుట్టిన రోజునాడే తొలి మ్యాచ్ ఆడి ఉంటే బాగుండేది. 20ఓవర్ల పాటు ఇదే తీవ్రతను కంటిన్యూ చేయాలనుకుంటున్నా’ అని టాస్ తర్వాత కోహ్లీ అన్నాడు.
Finally Virat King Kohli ?won the toss at his Birthday .#INDvSCO #T20WorldCup pic.twitter.com/JmQ02ctA9M
— Over Thinker Lawyer??♥️?? (@Muja_q_Nikala) November 5, 2021
ఈ కామెంట్ ను పోస్టు చేస్తూ.. కోహ్లీ ఎప్పుడూ బర్త్ డే జరుపుకుంటూనే ఉండు, బర్త్ డే కేక్ రోజూ కట్ చేయ్ అంటూ కామెంట్ చేస్తున్నారు.
……………………………. : చంద్రుడి మీద బండితో చక్కర్లు..కొత్త రకం బుల్లెట్
ప్రస్తుతం ఇండియా గ్రూప్ 1పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. సెమీ ఫైనల్ కు అర్హత సాధించాలంటే ఇతర జట్ల మధ్య జరిగే మ్యాచ్ ఫలితాలపై టీమిండియా భవితవ్యం ఆధారపడి ఉంది.
