NASA : చంద్రుడి మీద బండితో చక్కర్లు..కొత్త రకం బుల్లెట్

చంద్రుడు మీద ఎంచక్కా చక్కర్లు కొట్టవచ్చని నాసా వెల్లడిస్తోంది. ఇప్పటి వరకు చంద్రుడి మీద బండితో చక్కర్లు కొట్టలేదు.

NASA  : చంద్రుడి మీద బండితో చక్కర్లు..కొత్త రకం బుల్లెట్

Moon

Moon Electric Vehicles : చంద్రుడి మీదకు మనుషులు వెళ్లారు. అక్కడ పరిశోధనలు చేస్తున్నారు. ఉపగ్రహాలు పంపిస్తూ…చంద్రుడి మీద ఎమి జరుగుతుందో తెలుసుకుంటున్నారు. అయితే…చంద్రుడి మీద వాహనాలు తిప్పే అవకాశం ఉందా అంటే..ఎస్ అంటోంది నాసా. చంద్రుడు మీద ఎంచక్కా చక్కర్లు కొట్టవచ్చని నాసా వెల్లడిస్తోంది. ఇప్పటి వరకు చంద్రుడి మీద బండితో చక్కర్లు కొట్టలేదు.

Read More : India : స్థిరంగా పెట్రో ధరలు, తెలుగు రాష్ట్రాలు తగ్గించరా

ఆ లోటు తీర్చడానికే అమెరికన్ జాతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా కొత్త తరహా బుల్లెట్ బండిని రూపొందించింది. ఈసారి చంద్రుడి మీదకు వెళ్లినప్పుడు రాకెట్ తో పాటు…ఈ బుల్లెట్ బండిని కూడా తీసుకెళ్లి..చక్కర్లు కొట్టి రావచ్చు. ఎగుడు దిగుళ్లతో నిండి ఉండే చంద్రుడి ఉపరితలంపై సునాయసంగా ప్రయాణించేందుకు వీలుగా…నాసా శాస్త్రవేత్తలు బ్యాటరీతో నడిచే మోటార్ బైక్ ను రూపొందించారు.

Read More : Kidney Stones : తినే ఆహారాలు కిడ్నీల్లో రాళ్ళు ఏర్పడటానికి కారణమవుతాయా?..

ఈ వాహనం బరువు సుమారు 134 కిలోలు ఉంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే…ఏకధాటిగా చంద్రుడి మీద 70 మైళ్ల వరకు ప్రయాణించవచ్చని నాసా శాస్త్రవేత్తలు తెలిపారు. దీని గరిష్టవేగం…10 మైళ్లు…మాత్రమేనని తెలిపింది.