KKR : ఐపీఎల్ 2026 సీజన్‌కు ముందు కోల్‌కతాకు భారీ షాక్.. ఇప్పుడేం చేస్తుందో?
ఐపీఎల్ ప్రారంభానికి ముందు కేకేఆర్‌కు (KKR) భారీ షాక్ తగిలింది.
- Thota Vamshi Kumar
- Updated on- March 14, 2026 / 01:03 PM IST
Huge blow for KKR as fast bowler ruled out of IPL 2026
- ఐపీఎల్ ఆరంభానికి ముందు కేకేఆర్‌కు భారీ షాక్
- ఇంకా కోలుకోని టీమ్ఇండియా పేసర్
- సీజన్ మొత్తానికి దూరం
KKR : మార్చి 28 నుంచి ఐపీఎల్ 2026 ప్రారంభం కానుంది. ఈ మెగాటోర్నీ ఆరంభానికి సరిగ్గా 14 రోజుల సమయమే ఉంది. ఈ సమయంలో కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్ హర్షిత్ రాణా ఐపీఎల్ 2026 సీజన్‌కు దూరం అయ్యాడని సమాచారం.
టీ20 ప్రపంచకప్ 2026కి ముందు దక్షిణాప్రికాతో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో హర్షిత్ గాయపడ్డాడు. అతడి మోకాలికి గాయమైంది. గాయం తీవ్రమైనది కావడంతో ఆస్పత్రిలో అతడికి శస్త్రచికిత్స నిర్వహించారు. అతడు ఇంకా పూర్తిగా కోలుకోలేదని వార్తలు వస్తున్నాయి.
BoycottSRH : ‘మీకు దండం పెడతామయ్యా.. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను బ్యాన్ చేయండి’
హర్షిత్ రాణా అందుబాటులో ఉండడు. అయితే.. ఇది జట్టులోని ఇతర బౌలర్లకు చక్కని అవకాశం. వైభవ్, ఉమ్రాన్, కార్తీక్, ఆకాష్ లు ఆడే ఛాన్స్ ఉంది. హర్షిత్ స్థానంలో ఇంకా ఎవరిని తీసుకోలేదు. అని కేకేఆర్ ఫ్రాంఛైజీకి చెందిన ఓ అధికారి చెప్పినట్లు ఆంగ్ల మీడియాలో వార్తలు వస్తున్నాయి.
Sanju Samson : సంజూ శాంసన్ ఫోటోను ఎడిట్ చేసిన శుభ్‌మన్ గిల్..! మరి అంత అసూయ పనికిరాదయ్యా..?
హర్షిత్ ఐపీఎల్ 2026 నుంచి తప్పుకున్నట్లు కేకేఆర్ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. అతడి స్థానంలో ఎవరిని తీసుకుంటారు అన్న ఆసక్తి అందరిలో ఉంది.
