WWE Superstar Spectacle : WWE సూపర్‌స్టార్ స్పెక్టాకిల్‌కు సిద్దమైన హైదరాబాద్.. 28 మంది స్టార్స్.. ఎప్పుడు ఎక్కడంటే..?
వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్ (WWE) అంటే ఇష్టమా. అయితే మీకో శుభవార్త. హైదరాబాద్ వేదికగా సెప్టెంబర్ 8 నుంచి డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్‌స్టార్ స్పెక్టాకిల్ ప్రారంభం కానుంది.
- Thota Vamshi Kumar
- Updated on- August 14, 2023 / 03:06 PM IST
WWE Superstar Spectacle
WWE Superstar Spectacle 2023 : వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్ (WWE) అంటే ఇష్టమా. అయితే మీకో శుభవార్త. హైదరాబాద్ వేదికగా సెప్టెంబర్ 8 నుంచి డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్‌స్టార్ స్పెక్టాకిల్ ప్రారంభం కానుంది. గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి ఇండోర్ స్టేడియంలో ఈ రెజ్లింగ్ ఈవెంట్ జరగనుంది. డబ్ల్యూడబ్ల్యూఈ పోటీలకు హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వడం ఇదే తొలిసారి కాగా.. భారతదేశంలో ఈ క్రీడలు జరగనుండడం ఇది రెండోసారి.
ఈ ఈవెంట్‌కు సంబంధించిన పోస్టర్‌ను ఆదివారం తెలంగాణ క్రీడా మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ ఆవిష్కరించారు. 2017లో న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో మొదటి సారి పోటీలు జరిగాయి. దాదాపు ఏడు సంవత్సరాల తరువాత మరోసారి పోటీలు దేశంలో జరగనున్నాయి. ఈ పోటీల్లో అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన 28 మంది WWE స్టార్లు పాల్గొననున్నారు.
Pro Panja League 2023: రన్నరప్‌గా కిరాక్ హైదరాబాద్.. ఫైనల్లో పోరాడి ఓడిన తెలుగు జట్టు
ప్రపంచ హెవీవెయిట్ ఛాంపియన్ సేథ్ ‘ఫ్రీకిన్’ రోలిన్స్, మహిళల ప్రపంచ ఛాంపియన్ రియా రిప్లే, WWE ట్యాగ్ టీమ్ ఛాంపియన్ సమీ జైన్, కెవిన్ ఓవెన్స్‌లతో సహా కీలక WWE సూపర్‌స్టార్స్ పాల్గొనున్నారు. ఇంటర్కాంటినెంటల్ ఛాంపియన్ “ది రింగ్ జనరల్” గుంథర్, జిందర్ మహల్, వీర్, సంగ, డ్రూ మెక్‌ఇంటైర్, బెక్కీ లించ్, నటల్య, మాట్ రిడిల్, లుడ్విగ్ కైజర్ వంటి WWE స్టార్లు ఇందులో పోటీపడనున్నారు.
WWE ఈవెంట్ హైదరాబాద్‌లో నిర్వహించనున్నట్లు తెలుసుకున్న హైదరాబాద్ ఫ్యాన్స్‌తో పాటు దేశ వ్యాప్తంగా ఉన్న అభిమానులు ఈ ఈవెంట్ కోసం ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. www.bookmyshow.com ద్వారా టికెట్లను కొనుగోలు చేయవచ్చు.
