Vaibhav Sooryavanshi : వైభవ్‌ను ఎలా ఆపాలో నాకు తెలుసు.. ఎలాగంటే.. జోఫ్రా ఆర్చర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ యువ ఓపెనర్, 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ (Vaibhav Sooryavanshi) అదరగొడుతున్నాడు
- Thota Vamshi Kumar
- Updated on- May 28, 2026 / 11:07 AM IST
I know how to stop Vaibhav Sooryavanshi says Jofra Archer
- ఐపీఎల్ 2026లో అదరగొడుతున్న వైభవ్ సూర్యవంశీ
- బౌలర్లకు నిద్రలేని రాత్రుళ్లు మిగులుస్తున్న 15 ఏళ్ల బుడ్డోడు
- అతడిని ఎలా ఆపాలో తనకు తెలుసన్న జోఫ్రా ఆర్చర్
Vaibhav Sooryavanshi : ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ యువ ఓపెనర్, 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ అదరగొడుతున్నాడు. తన విధ్వంసకర ఇన్నింగ్స్‌లతో బౌలర్లకు నిద్రలేని రాత్రుళ్లు మిగులుస్తున్నాడు. అతడికి ఎక్కడ బంతులు వేయాలో కూడా తెలియడం లేదని సన్‌రైజర్స్ కెప్టెన్ పాట్ కమిన్స్ అన్నాడంటే.. అతడు ఏ లెవెల్‌లో బౌలర్లతో ఆడుకుంటున్నాడో అర్థం చేసుకోవచ్చు. బుధవారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో వైభవ్ 29 బంతుల్లోనే 97 పరుగులు సాధించి తృటిలో శతకాన్ని చేజార్చుకున్నాడు.
అతడి ఇన్నింగ్స్ పై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇక రాజస్థాన్ రాయల్స్ జట్టులోని ఆటగాళ్లు కూడా వైభవ్‌ను పొగిడేస్తున్నారు. ఇంగ్లాండ్ స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్, ధ్రువ్ జురెల్‌లు వైభవ్‌ను ప్రశంసించారు. వైభవ్ ఆట చూసేందుకు చాలా బాగుంది. అతడు ఎంత ఎక్కువ పరుగులు చేస్తే మాకు అంత మంచిది. అతడు 150 పరుగులు కూడా చేయగలడు. అని ఆర్చర్ అన్నాడు.
అతడిని ఎలా ఆపాలో తెలుసా? అనే ప్రశ్న ఎదురుకాగా ఆర్చర్ ఆసక్తికర సమాధానం ఇచ్చాడు. అతడిని ఎలా ఆపాలో తనకు తెలుసునని అయితే.. ఆ విషయం ఐపీఎల్ తరువాత చెబుతానన్నాడు.
‘వైభవ్ బ్యాటింగ్ పై తనకు పూర్తి నమ్మకం ఉందని ధ్రువ్ జురెల్ తెలిపాడు. వైభవ్‌లో ఉన్న గొప్ప విషయం ఏమిటంటే అతను దేనికీ ప్రణాళిక వేసుకోడు. ఎందుకంటే అతను చాలా ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తాడు. తనపై తనకు ఎల్లప్పుడూ నమ్మకం ఉంటుంది. అతను మైదానంలోకి వెళ్లి ఆడిన ప్రతిసారీ అదే చేస్తాడు. కాబట్టి అతనిలో ఉన్న గొప్ప విషయం ఏమిటంటే.. అతను తనపై తనకు నమ్మకం ఉంచుకుంటాడు. ‘నేను ఇది చేయలేను’ అనే సందేహం అతనిలో అస్సలు ఉండదు.’ అని జురెల్ అన్నాడు.
