×
Ad

ICC Mens T20 World Cup 2026: ఫైనల్స్‌కి దూసుకెళ్లిన న్యూజిలాండ్.. సెమీస్‌లో సౌతాఫ్రికాపై ఘనవిజయం

  • Published On : March 4, 2026 / 10:07 PM IST

Pic Courtesy @ EspnCricInfo

ICC Mens T20 World Cup 2026: టీ20 వరల్డ్ కప్ లో న్యూజిలాండ్ జట్టు ఫైనల్స్ కి దూసుకెళ్లింది. తొలి సెమీఫైనల్ లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో కివీస్ ఘన విజయం సాధించింది. 9 వికెట్ల తేడాతో సౌతాఫ్రికాను చిత్తు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా.. 8 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. 170 పరుగుల టార్గెట్ ను న్యూజిలాండ్ జట్టు అలవోకగా చేజ్ చేసింది. 12.5 ఓవర్లలోనే ఒక వికెట్ మాత్రమే కోల్పోయి టార్గెట్ ఫినిష్ చేసింది.

కివీస్ ఓపెనర్లు చెలరేగి ఆడారు. బౌండరీల వర్షం కురిపించారు. పరుగుల వరద పారించారు. ముఖ్యంగా ఫిన్ అలెన్ సూపర్ సెంచరీ బాదాడు. 33 బంతుల్లోనే 100 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. అతడి ఇన్నింగ్స్ లో 8 సిక్సర్లు, 10 ఫోర్లు ఉన్నాయి. మరో ఓపెనర్ సీఫర్ట్ హాఫ్ సెంచరీతో మెరిశాడు. 33 బంతుల్లో 58 పరుగులు చేశాడు. వీరిద్దరూ దంచి కొట్టడంతో కివీస్ మరో 43 బంతులు మిగిలి ఉండగానే టార్గెట్ ను కంప్లీట్ చేసింది. ఇక గురువారం భారత్-ఇంగ్లండ్ మధ్య రెండో సెమీఫైనల్ జరగనుంది. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు ఫైనల్ లో న్యూజిలాండ్ తో తలపడనుంది.