×
Ad

ICCT20 world Cup Final Astrology: మరి కొన్ని గంటల్లో T20 వరల్డ్ కప్ తుది సమరం.. విజేత ఎవరో చెబుతున్న జ్యోతిష్యులు

ICC T20 world cup Final astrology predictions : నేడు ఐసీసీ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. ఇండియా, న్యూజిలాండ్ జట్లు తలపడున్నాయి. ఈ క్రమంలో ఏ జట్టు కప్పు కొడుతుంది అనే దానిపై జ్యోతిష్య శాస్త్ర నిపుణలు ఆసక్తికర కామెంట్స్ చేస్తున్నారు.

ICC T20 world cup 2026 Final match astrology predictions for winner and man of the match

ICC T20 Final Astrology Predictions : 2026 ఐసీసీ టీ20 ప్రపంచ కప్ టోర్నీ నేటితో తుది దశకు చేరుకుంది. క్రికెట్ అభిమానులంతా ఆశగా ఎదురు చూస్తోన్న ఫైనల్ మ్యాచ్ తరుణం ఆసన్నం కావడానికి మరి కొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. కోట్లాదిమంది క్రికెట్ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఈ మ్యాచ్ కోసం ఎదురు చూస్తున్నారు. మరోసారి టీమిండియా కప్ కొట్టాలని ప్రతి ఒక్క భారతీయుడు కోరుకుంటున్నారు. ఇక నేడు అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగబోయే ఫైనల్ మ్యాచ్ లో ఇండియా.. న్యూజిలాండ్ తో తలపడబోతుంది. అయితే ఇప్పటి వరకు టీమిండియా.. న్యూజిలాండ్ మీద ఒక్కసారి కూడా గెలవలేదు. ఈ అంశం క్రికెట్ లవర్స్ ని భయపెడుతుంది. ఇదిలా ఉంటే నేటి మ్యాచ్ లో ఎలా అయినా సరే ఇండియా గెలవాలని అభిమానులు ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తున్నారు. కొందరు మరో అడుగు ముందుకు వేసి.. నేటి మ్యాచ్ గురించి జోస్యం చెబుతున్నారు. మరి జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ఇవాల్టి మ్యాచ్ విన్నర్ ఎవరు.. ఎవరి గ్రహ బలాలు ఎలా ఉన్నాయి అంటే..

నేడు ఫైనల్ మ్యాచ్ నేపథ్యంలో జ్యోతిష్య నిపుణులు.. నేటి గ్రహాల సంచారాలు, అలాగే ఇరు జట్లలో ముఖ్య ఆటగాళ్ల జన్మకుండళ్లు — ఉదాహరణకు సూర్యకుమార్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, మిచెల్ సాంట్నర్ వంటి వారి జాతకాలను పరిశీలించి.. మ్యాచ్‌లో కీలక మలుపులపై జోస్యం చెబుతున్నారు. గ్రహాల సంచారం, ఆటగాళ్ల జన్మ కుండళ్ల ప్రకారం నేటి మ్యాచ్‌లో ఏ ఆటగాళ్లు మెరుగ్గా రాణిస్తారో వెల్లడిస్తున్నారు. సమ ఉజ్జీల మధ్య పోటీ ఒక్కసారిగా ఎలా ఏకపక్షంగా మారనుందో అంచనా వేసి చెబుతున్నారు.

నేటి మ్యాచ్‌పై ప్రభావం చూపే గ్రహలు ఏవంటే..

  • చంద్రుడు- మ్యాచ్‌లో భావోద్వేగ సమయాన్ని ప్రభావితం చేసే గ్రహం చంద్రుడు. నేడు జరిగే మ్యాచ్ లో చంద్రుడు.. ఆటగాళ్ల స్పందన, ఒత్తిడిలో తీసుకునే నిర్ణయాలు, మానసిక స్థితిని ప్రభావితం చేస్తాడని జ్యోతిష్యశాస్త్ర నిపుణులు అంచనా వేస్తున్నారు.
  • అంగారకుడు – దూకుడు, శారీరక శక్తి, పోటీ తత్వానికి ప్రతీక అంగారకుడు. ఈ గ్రహం బలంగా ఉన్నప్పుడు దూకుడు బ్యాటింగ్, వేగవంతమైన బౌలింగ్‌కు అనుకూలంగా ఉంటుందంటున్నారు.
  • బుధుడు – సమన్వయం, రిఫ్లెక్సులు, వ్యూహాత్మక ఆలోచనలను నియంత్రించే గ్రహం. బుధుడు బలంగా ఉంటే బ్యాటింగ్ మరింత చురుకుగా, ఫీల్డింగ్ ఖచ్చితంగా ఉండనుందంటున్నారు.
  • గురు – అదృష్టం, అవకాశాలు, కీలక మలుపులపై ప్రభావం చూపుతాడని… మ్యాచ్ ఫలితాన్ని మార్చే క్షణాలను గురువు ప్రభావితం చేస్తాడని వెల్లడిస్తున్నారు.
  • శని – క్రమశిక్షణ, వ్యూహంతో ఆడాలని సూచించే గ్రహం. శని ప్రభావం ఉన్నప్పుడు జట్లు జాగ్రత్తగా ఇన్నింగ్స్‌ను నిర్మించే ప్రయత్నం చేస్తాయి.

మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఎవరవుతారంటే..
జ్యోతిష్యం ప్రకారం.. క్రీడల్లో.. ప్రదర్శనలు సాధారణంగా మంగళ–గురు సంయోగం బలంగా ఉన్నప్పుడు అద్భుత ఫలితాలు కనిపిస్తాయని పండితులు చెబుతున్నారు. చెబుతారు. భారత్ తరఫున హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్ మ్యాచ్‌ను మలుపు తిప్పే ప్రదర్శన ఇవ్వగల అవకాశాలు అధికంగా ఉన్నాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. న్యూజిలాండ్ తరఫున, ప్రారంభంలో బలమైన భాగస్వామ్యం లేకపోతే మిచెల్ సాంట్నర్ కీలక పాత్ర పోషించే అవకాశం ఉందంటున్నారు.

విజేతగా నిలిచే అవకాశాలు ఏ జట్టుకి ఎక్కువగా ఉన్నాయంటే
గ్రహాల సంచారాలు, ఆటగాళ్ల జాతకాల ఆధారంగా చూస్తే, నేడు గ్రహాల కదలికలన్నీ కూడా భారత్ జట్టు దూకుడు ఆటశైలికి కొంతమేర అనుకూలంగా ఉన్నట్లు కనిపిస్తోంది. , మ్యాచ్ సమయంలో కర్కాటక రాశిలో ఉన్న చంద్రుడు సూర్యుడితో త్రికోణాన్ని ఏర్పరచుకుంటున్నాడు. ఇది భారత జట్టుకు స్థిరత్వాన్ని అందిస్తుంది. అలాగే వీరు మానసికంగా కూడా చాలా దృఢంగా ఉంటారు. ఆటపై వీరి దృష్టి ఉంటుంది. ముఖ్యంగా ఛేజింగ్ సమయంలో అసమానమైన బలాన్ని అందిస్తుంది.

అయితే న్యూజిలాండ్ జట్టు శని ప్రభావం వల్ల క్రమశిక్షణతో ఆడి చివరి వరకు పోటీలో నిలబడే అవకాశం ఉంది. అయితే శని ప్రభావం వల్ల న్యూజిలాండ్ జట్టు చాలా ఇబ్బందికర పరిస్థితులను చవి చూడాల్సి వస్తుంది అంటున్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నేడు గ్రహాల అనుకూలం వలన, ప్రతి ఆటగాడి , ఆటతీరు చాలా అద్భుతంగా ఉండబోతుంది అంతా పక్కానే. ఏది ఎలా ఉన్నా ఈ సారి కూడా కప్పు టీమిండియాదే అంటున్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు.

గమనిక:ఈ అంచనాలు పూర్తిగా జ్యోతిష్య విశ్లేషణ ఆధారంగా చేసిన అంచనాలు మాత్రమే. పాఠకుల ఆసక్తి కోసం ఇచ్చిన ఈ సమాచారాన్ని 10TV ధృవీకరించలేదు.