Gautam Gambhir : గంభీర్‌ను వీళ్లు చేసినంత ర్యాగింగ్ ఎవరు చేయలేరు.. ఒక్కోటి ఒక్కో డైమండ్..
టీమ్ఇండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌ను (Gautam Gambhir) ఐస్‌లాండ్ క్రికెట్ అసోసియేషన్ ట్రోల్ చేసినంతగా మరెవరూ కూడా ట్రోల్ చేయరు.
- Thota Vamshi Kumar
- Updated on- July 10, 2026 / 02:47 PM IST
Iceland Cricket trolls Gautam Gambhir than anybody
Gautam Gambhir : ఐస్‌లాండ్‌కు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)లో సభ్యత్వం లేదు. ఆ దేశంలో క్రికెట్ ఒక అభివృద్ధి చెందుతున్న క్రీడ. వీరికి జాతీయ జట్టు ఉన్నప్పటికీ, వీరు సోషల్ మీడియాలో ఇతర దేశాల క్రికెటర్లను, బోర్డులను వ్యంగ్యంగా ట్రోల్ చేస్తూ ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన గుర్తింపు, ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. ముఖ్యంగా గౌతమ్ గంభీర్‌ను వీరు ట్రోల్ చేసినంతగా ఎవరూ ట్రోల్ చేయరు.
గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్‌గా బాధ్యతలను చేపట్టిన తరువాత భారత జట్టు ఘోర పరాజయాలను చవిచూస్తోంది. స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో టెస్టు సిరీస్ వైట్‌వాష్ నుంచి తేరుకోకముందే ఐర్లాండ్‌తో టీ20 సిరీస్, ఆ తరువాత ఇంగ్లాండ్‌తో 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే భారత్ కోల్పోయింది.
Also Read : ముందు వీళ్లను తీసేయండి సార్.. దరిద్రం పోతుంది..
గంభీర్ చేసే అతి ప్రయోగాల కారణంగానే వరుసగా రెండు టీ20 ప్రపంచకప్‌లను గెలుచుకున్న భారత జట్టు ఇప్పుడు విజయం కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ మ్యాచ్‌లో ఆడిన ప్లేయర్ ఆ తదుపరి మ్యాచ్‌లో కనిపించడని, ఆల్‌రౌండర్లు అంటూ జట్టును నాశనం చేస్తున్నామని మండిపడుతున్నారు. గంభీర్‌ను హెడ్‌కోచ్‌గా తప్పించాలనే డిమాండ్లు ఊపందుకున్నాయి.
ఇదిలా ఉంటే.. నాలుగో టీ20 మ్యాచ్‌లో భారత జట్టు ఓడిపోయి మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను సమర్పించుకున్న నేపథ్యంలో గంభీర్‌ను ఎద్దేవా చేస్తూ ఐస్‌లాండ్ క్రికెట్ అసోసియేషన్ ప్రస్తుత, గతంలో చేసిన ట్వీట్లు వైరల్ అవుతున్నాయి. తాము హెడ్ కోచ్‌గా గంభీర్‌ను అస్సలు పెట్టుకోమన్న ట్వీట్ వైరల్ అవుతోంది.
We can confirm that we don’t wish to add Gautam Gambhir to our coaching staff. He clearly has talent, though. To take those Indian players and deliver those results in Ireland takes truly remarkable gifts.
— Iceland Cricket (@icelandcricket) June 28, 2026
As the boundaries flow like liquid gold in Bristol, the whereabouts of Gautum Gambhir are now unknown, but he isn’t here with our men’s national squad in Poland. That much we know!
— Iceland Cricket (@icelandcricket) July 9, 2026
