IND vs AFG : టాస్ గెలిచిన టీమ్ఇండియా.. అఫ్గాన్ బ్యాటింగ్‌.. భార‌త తుది జ‌ట్టులో కీల‌క మార్పు..

భార‌త్‌, అఫ్గానిస్థాన్ జ‌ట్ల మ‌ధ్య ఢిల్లీ వేదిక‌గా రెండో టీ20 మ్యాచ్ (IND vs AFG) ప్రారంభమైంది.

IND vs AFG 2nd T20 Team India have won the toss and opted to field

IND vs AFG : భార‌త్‌, అఫ్గానిస్థాన్ జ‌ట్ల మ‌ధ్య ఢిల్లీ వేదిక‌గా రెండో టీ20 మ్యాచ్ ప్రారంభమైంది. టాస్ గెలిచిన భార‌త కెప్టెన్ శ్రేయస్ అయ్య‌ర్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో అఫ్గానిస్థాన్ తొలుత బ్యాటింగ్ చేయ‌నుంది. భార‌త తుది జ‌ట్టులో ఓ మార్పు చోటు చేసుకుంది. గాయంతో వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి దూరం కాగా అత‌డి స్థానంలో ర‌విబిష్ణోయ్ వ‌చ్చాడు.

‘మేము మొద‌ట బౌలింగ్ చేస్తాం. పిచ్ ఎలా స్పందిస్తుందనే దానిపై ఓ అవగాహన ఉంటుంది. బౌల‌ర్ల‌కు అద‌న‌పు ప్ర‌యోజ‌నాన్ని చేకూర్చ‌వ‌చ్చు. మధ్య ఓవర్లలో సాధ్య‌మైన‌న్ని ఎక్కువ వికెట్లు తీసేందుకు ప్ర‌య‌త్నిస్తాం. వరుణ్ చ‌క్ర‌వ‌ర్తి గాయ‌ప‌డ్డాడు. అత‌డి స్థానంలో రవి బిష్ణోయ్ జట్టులోకి వచ్చాడు.’ అని శ్రేయ‌స్ అయ్యర్ అన్నాడు.

‘టాస్ గెలిచి ఉంటే మేము బౌలింగ్ చేసే వాళ్లం. అయిన‌ప్ప‌టికి మేము పాజిటివ్ క్రికెట్ ఆడతాము. గ‌త మ్యాచ్‌లో మాకు మంచి ప్రారంభం ల‌భించ‌లేదు. అయిన‌ప్ప‌టికి మ‌ధ్య ఓవ‌ర్ల‌లో మేము పుంజుకున్నాము. ఈ రోజు త‌ప్పుల‌ను స‌రిదిద్దుకుని బాగా ఆడేందుకు ప్ర‌య‌త్నిస్తాం. జ‌ట్టులో ఎలాంటి మార్పు లేదు. గ‌త మ్యాచ్‌లో ఆడిన జ‌ట్టుతోనే బ‌రిలోకి దిగుతున్నాం.’ అని అఫ్గానిస్థాన్ కెప్టెన్ ఇబ్ర‌హీం జ‌ద్రాన్ అన్నాడు.

అఫ్గానిస్థాన్ తుది జ‌ట్టు..

రహ్మానుల్లా గుర్బాజ్(వికెట్ కీప‌ర్‌), ఇబ్రహీం జద్రాన్(కెప్టెన్‌), సెదిఖుల్లా అటల్, గుల్బాదిన్ నాయబ్, దర్వీష్ రసూలీ, అజ్మతుల్లా ఒమర్జాయ్, మహ్మద్ నబీ, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, ముజీబ్ ఉర్ రహమాన్, ఫజల్హాక్ ఫరూఖీ.

భార‌త తుది జ‌ట్టు..

సంజు శాంసన్(వికెట్ కీప‌ర్‌), అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్(కెప్టెన్‌), తిలక్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, శివమ్ దూబే, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, జ‌స్‌ప్రీత్ బుమ్రా.