IND vs NZ : విల్ యంగ్ సెంచరీ.. భారత టార్గెట్ 334
IND vs NZ : ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య మౌంట్ మౌంగనుయి వేదికగా నాలుగో వన్డే మ్యాచ్ జరుగుతోంది.
- Thota Vamshi Kumar
- Updated on- November 13, 2026 / 11:31 AM IST
IND vs NZ 4th ODI Will Young Century Team India Target is 334
IND vs NZ : ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య మౌంట్ మౌంగనుయి వేదికగా నాలుగో వన్డే మ్యాచ్ జరుగుతోంది. ఓపెనర్ విల్ యంగ్ సెంచరీ (125; 108 బంతుల్లో 14 ఫోర్లు, 4 సిక్సర్లు) చేయడంతో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 333 పరుగులకు ఆలౌటైంది. దీంతో భారత్ ముందు 334 పరుగుల లక్ష్యం నిలిచింది.
కివీస్ బ్యాటర్లలో టిమ్ సీఫెర్ట్ (58; 48 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లు) హాఫ్ సెంచరీ చేశాడు. ఫిన్ అలెన్ (41; 30 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లు) వేగంగా ఆడాడు. కెప్టెన్ మిచెల్ సాంట్నర్ (24; 29 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్సర్లు), క్రిస్టియన్ క్లార్క్ (22; 22 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్), కైల్ జేమిసన్ (19 నాటౌట్; 21 బంతుల్లో 1 ఫోర్) పర్వాలేదనిపించారు. భారత బౌలర్లలో అకిల్ నబీ, గుర్నూర్ బ్రార్, అక్షర్ పటేల్లు తలా రెండు వికెట్లు తీశారు. అర్ష్దీప్ సింగ్, నమన్ ధీర్లు చెరో వికెట్ సాధించారు.
