Tilak Varma : న్యూజిలాండ్‌తో నాలుగో టీ20 మ్యాచ్ నేడే.. భారీ మైలురాయిపై తిలక్ వర్మ కన్ను..
న్యూజిలాండ్‌తో నాలుగో టీ20 మ్యాచ్‌కు ముందు తిలక్ వర్మను (Tilak Varma) ఓ భారీ మైలురాయి ఊరిస్తోంది.
- Thota Vamshi Kumar
- Published on- October 30, 2026 / 10:50 AM IST
IND vs NZ 4th T20 Match today Tilak Varma eye on 100 International T20 Sixes
Tilak Varma : ఆక్లాండ్ వేదికగా భారత్, న్యూజిలాండ్ మధ్య నేడు నాలుగో టీ20 మ్యాచ్ జరగనుంది. కాగా.. ఈ మ్యాచ్‌కు ముందు టీమ్ఇండియా స్టార్ ఆటగాడు తిలక్ వర్మను ఓ అరుదైన మైలురాయి ఊరిస్తోంది. తిలక్ గనుక ఈ మ్యాచ్‌లో 6 సిక్సర్లు బాదితే.. అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో 100 సిక్సర్ల క్లబ్‌లో అడుగుపెడతాడు.
అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో ఇప్పటి వరకు కేవలం ఆరుగురు భారత ఆటగాళ్లు మాత్రమే 100 సిక్సర్ల మైలురాయిని చేరుకున్నారు. వారే.. రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, అభిషేక్ శర్మ, విరాట్ కోహ్లీ, సంజూ శాంసన్. ఒకవేళ తిలక్ ఆరు సిక్సర్లు కొడితే ఏడో ప్లేయర్‌గా రికార్డులకు ఎక్కుతాడు.
Rohit Sharma : ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ పగ్గాలు మళ్లీ రోహిత్ శర్మకే.. తిలక్ వర్మకు గుడ్‌న్యూస్..
అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో తిలక్ వర్మ 2023లో అరంగ్రేటం చేయగా.. ఇప్పటి వరకు 73 మ్యాచ్‌లు ఆడాడు. 44.2 సగటుతో 1899 పరుగులు సాధించాడు. ఇందులో రెండు శతకాలు,11 అర్థశతకాలు ఉన్నాయి. 146 ఫోర్లు, 94 సిక్సర్లు కొట్టాడు.
అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో 100 సిక్సర్లు కొట్టిన భారత ఆటగాళ్లు..
* రోహిత్ శర్మ – 159 మ్యాచ్‌ల్లో 205 సిక్సర్లు
* సూర్యకుమార్ యాదవ్ – 113 మ్యాచ్‌ల్లో 179 సిక్సర్లు
* అభిషేక్ శర్మ – 70 మ్యాచ్‌ల్లో 158 సిక్సర్లు
* హార్దిక్ పాండ్యా – 138 మ్యాచ్‌ల్లో 126 సిక్సర్లు
* విరాట్ కోహ్లీ – 125 మ్యాచ్‌ల్లో 124 సిక్సర్లు
* సంజూ శాంసన్ – 80 మ్యాచ్‌ల్లో 108 సిక్సర్లు
