IND vs NZ : టాస్ గెలిచిన భారత్.. న్యూజిలాండ్ బ్యాటింగ్.. తుది జట్టులో కీలక మార్పులు.. వైభవ్, భువీలు ఔట్..
IND vs NZ : ఆక్లాండ్ వేదికగా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య నాలుగో టీ20 మ్యాచ్ ప్రారంభమైంది.
- Thota Vamshi Kumar
- Published on- October 30, 2026 / 12:13 PM IST
IND vs NZ 4th T20 Team India opt to bowl two changes
IND vs NZ : ఆక్లాండ్ వేదికగా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య నాలుగో టీ20 మ్యాచ్ ప్రారంభమైంది. టాస్ గెలిచిన భారత జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో న్యూజిలాండ్ తొలుత బ్యాటింగ్ చేయనుంది. మరో వైపు భారత జట్టులో రెండు కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. గాయం నుంచి కోలుకున్న ఇషాన్ కిషన్ తిరిగి జట్టులో వచ్చాడు. దీంతో అతడి స్థానంలో గత రెండు మ్యాచ్‌లు ఆడిన వైభవ్ సూర్యవంశీ చోటు కోల్పోయాడు. మరోవైపు రీ ఎంట్రీలో విఫలం అవుతున్న భువీ స్థానంలో మయాంక్ యాదవ్ జట్టులోకి వచ్చాడు.
తొలి మూడు మ్యాచ్‌ల్లో గెలిచిన భారత్ ఇప్పటికే సిరీస్‌ను కైవసం చేసుకుంది. అయినప్పటికి కూడా టీమ్ఇండియా క్లీన్ స్వీప్ పై కన్నేసింది. ఈ నేపథ్యంలో మరోసారి గెలుపే లక్ష్యంగా భారత్ బరిలోకి దిగింది. మరోవైపు ఇప్పటికే సిరీస్ కోల్పోయిన న్యూజిలాండ్ ఈ మ్యాచ్‌లోనైనా గెలిచి భారత ఆధిక్యాన్ని తగ్గించి పరువు నిలబెట్టుకోవాలని ఆరాటపడుతోంది.
Tilak Varma : న్యూజిలాండ్‌తో నాలుగో టీ20 మ్యాచ్ నేడే.. భారీ మైలురాయిపై తిలక్ వర్మ కన్ను..
‘మేము బౌలింగ్ చేస్తాం. మా వైఖరిలో ఎలాంటి మార్పు లేదు. దూకుడైన క్రికెట్ ఆడతాం. కుర్రాళ్లకు కూడా ఇదే సందేశం ఇచ్చాం. అందరూ ఉత్సాహంగా ఉన్నారు. ముఖ్యంగా మా బౌలర్ల ప్రదర్శన అద్భుతంగా ఉంది. ఈ పిచ్ పై బౌన్స్, సీమ్ మూవ్‌మెంట్‌ను ఆశిస్తున్నాం. తుది జట్టులో రెండు మార్పులు ఉన్నాయి. వైభవ్ స్థానంలో ఇషాన్ కిషన్, భువీ స్థానంలో మయాంక్ యాదవ్‌లు వచ్చారు.’ అని శ్రేయస్ అయ్యర్ అన్నారు.
‘ప్రతి రోజు ఓ కొత్త ఆరంభం. పిచ్ బాగున్నట్లుగా కనిపిస్తోంది. ఈ పిచ్ పై బంతి కొంచెం ఎక్కువగా బౌన్స్ అవుతోందని అనిపిస్తోంది. ఒక్కసారి క్రీజులో కుదురుకుంటే.. మంచి స్కోరు సాధించే అవకాశం ఉంటుంది. మేము మా ప్రణాళికల గురించి చర్చించుకున్నాం. బ్యాటింగ్ విభాగంలో మేము బాగానే రాణిస్తున్నాం. గాలి బలంగా వీస్తున్నందున.. ఈరోజు ఫీల్డింగ్‌లో క్యాచ్‌లు పట్టడం కష్టతరంగా మారవచ్చు. పవర్‌ప్లేలో ప్రత్యర్థి జట్టు చాలా దూకుడుగా ఆడవచ్చు. కైల్ జేమిసన్ స్థానంలో నాథన్ స్మిత్ తిరిగి జట్టులోకి వచ్చాడు.’ అని మిచెల్ సాంట్నర్ అన్నాడు.
న్యూజిలాండ్ జట్టు..
ఫిన్ అలెన్, టిమ్ సీఫెర్ట్(వికెట్ కీపర్), డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, బెవాన్ జాకబ్స్, మైఖేల్ బ్రేస్‌వెల్, మిచెల్ సాంట్నర్(కెప్టెన్), నాథన్ స్మిత్, ఆడమ్ మిల్నే, జాకబ్ డఫీ, మాథ్యూ ఫిషర్
భారత జట్టు..
అభిషేక్ శర్మ, సంజు శాంసన్(వికెట్ కీపర్), ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్(కెప్టెన్), తిలక్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, నమన్ ధీర్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, మయాంక్ యాదవ్, ప్రిన్స్ యాదవ్.
