Tilak Varma : న్యూజిలాండ్‌తో నాలుగో టీ20 మ్యాచ్.. తిలక్ వర్మను ఊరిస్తున్న భారీ మైలురాయి..
నాలుగో టీ20 మ్యాచ్‌కు ముందు తిలక్ వర్మను (Tilak Varma) ఓ భారీ మైలురాయి ఊరిస్తోంది.
- Thota Vamshi Kumar
- Updated on- October 29, 2026 / 09:47 AM IST
IND vs NZ 4th T20 Tilak Varma Need 6 More To Complete 100 Sixes In International T20s
Tilak Varma : ఆక్లాండ్ వేదికగా భారత్, న్యూజిలాండ్ మధ్య శుక్రవారం (అక్టోబర్ 30న) నాలుగో టీ20 మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌కు ముందు తెలుగు తేజం, టీమ్ఇండియా మిడిల్ ఆర్డర్ ఆటగాడు తిలక్ వర్మను ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది. ఈ మ్యాచ్‌లో తిలక్ 6 సిక్సర్లు కొడితే.. అంతర్జాతీయ టీ20 క్రికెట్లో 100 సిక్సర్ల మైలురాయిని చేరుకుంటాడు.
అంతర్జాతీయ టీ20 క్రికెట్లో ఇప్పటి వరకు ఆరుగురు భారత ఆటగాళ్లు.. రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, అభిషేక్ శర్మ, విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా, సంజూ శాంసన్‌లు మాత్రమే 100 సిక్సర్ల మైలురాయిని చేరుకున్నారు. తిలక్ ఆరు సిక్సర్లు కొడితే ఏడో భారత ఆటగాడిగా రికార్డులకు ఎక్కనున్నాడు.
2023లో అంతర్జాతీయ టీ20 క్రికెట్లో తిలక్ వర్మ అరంగ్రేటం చేశాడు. ఇప్పటి వరకు అతడు 73 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. 44.2 సగటుతో 1899 పరుగులు సాధించాడు. ఇందులో రెండు సెంచరీలు, 11 అర్థశతకాలు ఉన్నాయి. 146 ఫోర్లు, 94 సిక్సర్లు బాదాడు.
అంతర్జాతీయ టీ20 క్రికెట్లో 100 సిక్సర్లు కొట్టిన భారత ఆటగాళ్లు..
* రోహిత్ శర్మ – 159 మ్యాచ్‌ల్లో 205 సిక్సర్లు
* సూర్యకుమార్ యాదవ్ – 113 మ్యాచ్‌ల్లో 179 సిక్సర్లు
* అభిషేక్ శర్మ – 70 మ్యాచ్‌ల్లో 158 సిక్సర్లు
* హార్దిక్ పాండ్యా – 138 మ్యాచ్‌ల్లో 126 సిక్సర్లు
* విరాట్ కోహ్లీ – 125 మ్యాచ్‌ల్లో 124 సిక్సర్లు
* సంజూ శాంసన్ – 80 మ్యాచ్‌ల్లో 108 సిక్సర్లు
