IND vs NZ : ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో బోణీ కొట్టిన భారత్.. తొలి మ్యాచ్లో న్యూజిలాండ్ పై ఘన విజయం..
IND vs NZ : ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ లో టీమ్ఇండియా శుభారంభం చేసింది
- Thota Vamshi Kumar
- Updated on- October 22, 2026 / 04:49 PM IST
IND vs NZ : ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ లో టీమ్ఇండియా శుభారంభం చేసింది. క్రైస్ట్ చర్చ్ వేదికగా జరిగిన తొలి టీ20 మ్యాచ్లో 4 వికెట్ల తేడాతో విజయాన్ని సాధించింది. 226 పరుగుల లక్ష్యాన్ని 19.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. దీంతో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది.
టీమ్ఇండియా బ్యాటర్లలో సంజూ శాంసన్ (67; 33 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్లు) హాఫ్ సెంచరీ చేశాడు. నమన్ ధీర్ (42 నాటౌట్; 15 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లు), శ్రేయస్ అయ్యర్ (42; 28 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్సర్లు), అభిషేక్ శర్మ (29; 12 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లు), అక్షర్ పటేల్ (24; 14 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్)లు రాణించారు. న్యూజిలాండ్ బౌలర్లలో కెప్టెన్ మిచెల్ సాంట్నర్, మైఖేల్ బ్రేస్వెల్ లు చెరో రెండు వికెట్లు తీశారు. లాకీ ఫెర్గూసన్, ఆడమ్ మిల్న్ లు తలా ఓ వికెట్ సాధించారు.
అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 225 పరుగులు చేసింది. కివీస్ బ్యాటర్లలో గ్లెన్ ఫిలిప్స్ (82 నాటౌట్; 40 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్లు) హాఫ్ సెంచరీ చేశాడు. ఫిల్ అలెన్ (45; 24 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లు), బెవాన్ జాకబ్స్ (31 16 బంతుల్లో 3 సిక్సర్లు) వేగంగా ఆడగా.. టిమ్ సీఫెర్ట్ (27; 14 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్), డారిల్ మిచెల్ (28; 19 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్) లు రాణించారు. భారత బౌలర్లలో అర్ష్దీప్ సింగ్, మయాంక్ యాదవ్, అక్షర్ పటేల్ లు తలా ఓ వికెట్ తీశారు.
