IND Vs SA: బ్యాటింగ్ చేస్తున్నప్పుడు రహానె సెల్ఫ్ మోటివేషన్‌కు నెటిజన్లు ఫిదా
ఇండియన్ బ్యాటర్ అజింకా రహానె బ్యాటింగ్ చేస్తున్న సమయంలోని సెల్ఫ్ మోటివేషన్ కు భళే కాంప్లిమెంట్స్ వస్తున్నాయి. క్రీజులో ఉండగా వాచ్ ద బాల్.. వాచ్ ద బాల్ అంటూ మోటివేషన్ కోసం పదే పదే..
- Subhan Ali Shaik
- Published On : December 27, 2021 / 10:58 AM IST
Ajinkya Rahane
IND Vs SA: ఇండియన్ బ్యాటర్ అజింకా రహానె బ్యాటింగ్ చేస్తున్న సమయంలోని సెల్ఫ్ మోటివేషన్ కు భళే కాంప్లిమెంట్స్ వస్తున్నాయి. క్రీజులో ఉండగా వాచ్ ద బాల్.. వాచ్ ద బాల్ అంటూ మోటివేషన్ కోసం పదే పదే చెప్తున్న మాటలు వైరల్ అయ్యాయి. దక్షిణాఫ్రికా వేదికగా బాక్సింగ్ డే టెస్టులో భాగంగా తొలి రోజు రహానె మాటలు ఇలా రికార్డయ్యాయి. 81బంతుల్లో 40బంతులు ఆడిన రహానె రెండో రోజు ఆటలోనూ కంటిన్యూ చేయనున్నారు.
గతేడాది ఆస్ట్రేలియాతో మ్యాచ్ ల తర్వాత రహానె మంచి స్కోరు కనబరిచిందే లేదు. ఈ క్రమంలోనే చాలా ఒత్తిడిలో కనిపించిన రహానె.. ప్రస్తుత సిరీస్ లో పరుగుల కోసం పరితపిస్తున్నాడు. చాలా మంది రహానెను తప్పించి శ్రేయాస్ అయ్యర్, హనుమ విహారీ లాంటి వాళ్లకు చోటు కల్పిస్తారని భావించారు. అటువంటి పరిస్థితుల్లో రహానె 40పరుగులు చేసి క్రీజులో కొనసాగుతున్నాడు.
Ajinkya Rahane constantly saying to himself .."watch the ball"
He did see the ball perfectly here ?#INDvsSA #INDvSA #SAvsIND #SAvIND #CricketTwitter pic.twitter.com/ryfaFbCiaP
— V (@testaahebest) December 26, 2021
సెంచూరియన్ లో తొలి టెస్టుకు ముందు రహానె 12మ్యాచ్ లు ఆడిన యావరేజ్ 19.57సగటుతో ఉన్నాడు. బ్యాటింగ్ ప్రదర్శన సరిగా లేకపోవడంతో వైస్ కెప్టెన్ పదవికి సైతం దూరమయ్యాడు. ఇలాంటి సమయంలో రహానె చూపిస్తున్న సెల్ఫ్ మోటివేషన్ నెటిజన్ల నుంచి మంచి స్పందన దక్కించుకుంటుంది.
rEAD aLSO : ఎన్నికల కమిషన్‌ను రద్దు చేసిన తాలిబన్ల ప్రభుత్వం
