Shubman Gill Catch : శుభ్‌మ‌న్ గిల్ స్ట‌న్నింగ్ క్యాచ్‌.. సింగిల్ హ్యాండ్‌తో.. వీడియో వైర‌ల్‌..

IND vs SL: టీమ్ఇండియా కెప్టెన్ శుభ్‌మ‌న్ గిల్ స్ట‌న్నింగ్ క్యాచ్ (Shubman Gill stunning catch) అందుకున్నాడు.

Shubman Gill grabs stunning catch to send Kamindu Mendis

Shubman Gill Catch Video: టీమ్ఇండియా కెప్టెన్ శుభ్‌మ‌న్ గిల్ స్ట‌న్నింగ్ క్యాచ్ అందుకున్నాడు. గాలే వేదిక‌గా శ్రీలంక‌తో జ‌రుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో అత‌డు త‌న అద్భుత ఫీల్డింగ్‌తో ఆక‌ట్టుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియా వైర‌ల్‌గా మారింది.

మ్యాచ్ మూడో రోజు ఆటలో భాగంగా శ్రీలంక తొలి ఇన్నింగ్స్ 17వ ఓవ‌ర్‌లో గిల్ సూప‌ర్ ఫీల్డింగ్ చేశాడు. ఈ ఓవ‌ర్‌ను కుల్దీప్ యాద‌వ్ వేయాడు. తొలి బంతిని లంక బ్యాట‌ర్ క‌మిందు మెండీస్ షాట్ ఆడాడు. షార్ట్ ఎక్స్‌ట్రా క‌వ‌ర్స్‌లో ఫీల్డింగ్ చేస్తున్న శుభ్‌మ‌న్ గిల్ డైవ్ చేస్తూ సింగిల్ హ్యాండ్‌తో చ‌క్క‌ని క్యాచ్ అందుకున్నాడు.

Also Read – గాంధీ జయంతి రోజునే వన్డే ప్రపంచకప్‌కు శ్రీకారం.. ఐసీసీ ప్లాన్ ఇదే..

 

గిల్ స్ట‌న్నింగ్ క్యాచ్ చూసి తోటి ప్లేయ‌ర్లు, అభిమానులు ఆశ్చ‌ర్య‌పోయారు. ఇందుకు సంబంధించిన వీడియో వైర‌ల్‌గా మార‌గా.. కెప్టెనా.. మ‌జాకానా అని నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు. కాగా.. గిల్ క్యాచ్ అందుకోవ‌డంతో మెండీస్ 14 ప‌రుగుల‌కే పెవిలియ‌న్‌కు చేరుకున్నాడు. దీంతో లంక జ‌ట్టు 59 ప‌రుగుల‌కే 4 వికెట్లు కోల్పోయి క‌ష్టాల్లో ప‌డింది.

అంత‌క‌ముందు భార‌త జ‌ట్టు తొలి ఇన్నింగ్స్‌లో 462 ప‌రుగుల‌కు ఆలౌటైంది. టీమ్ఇండియా బ్యాట‌ర్ల‌లో దేవ్‌ద‌త్ ప‌డిక్క‌ల్ (167) భారీ శ‌త‌కంతో చెల‌రేగాడు. ఓపెన‌ర్ కేఎల్ రాహుల్ (82), ధ్రువ్ జురెల్ (51) హాఫ్ సెంచ‌రీలు చేశారు. లంక బౌల‌ర్ల‌లో ప్ర‌భాత్ జ‌య‌సూర్య నాలుగు వికెట్లు తీశాడు. కేశర నువాంత మూడు వికెట్లు సాధించాడు. అసిథ ఫెర్నాండో రెండు వికెట్లు ప‌డ‌గొట్టాడు.