IND vs SL : శ‌త‌కాల‌తో చెల‌రేగిన ధ్రువ్ జురెల్, దేవ్‌ద‌త్ ప‌డిక్క‌ల్‌.. భార‌త తొలి ఇన్నింగ్స్ 503/9 డిక్లేర్‌..

కొలంబో వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ లో (IND vs SL ) భారత్ తమ తొలి ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసింది.

IND vs SL 2nd Test team india declared 1st Innings at 503 runs loss of 9 wickets

IND vs SL : భార‌త్, శ్రీలంక జ‌ట్ల మ‌ధ్య కొలంబో వేదిక‌గా రెండో టెస్టు మ్యాచ్ జ‌రుగుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భార‌త్ తొలి ఇన్నింగ్స్‌ను 503/9 స్కోరు వ‌ద్ద డిక్లేర్ చేసింది. టీమ్ఇండియా బ్యాట‌ర్ల‌లో దేవ్‌ద‌త్ ప‌డిక్క‌ల్ (117; 193 బంతుల్లో 12 ఫోర్లు) ధ్రువ్ జురెల్ (115 నాటౌట్; 177 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స‌ర్లు) లు శ‌త‌కాల‌తో చెల‌రేగారు.

Yashasvi Jaiswal : య‌శ‌స్వి జైస్వాల్‌కు ఐసీసీ బిగ్ షాక్‌..

వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్ రిష‌బ్ పంత్ (63; 89 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స‌ర్లు), కెప్టెన్ శుభ్‌మ‌న్ గిల్ (50; 108 బంతుల్లో 6 ఫోర్లు) హాఫ్ సెంచ‌రీలు బాదారు. య‌శ‌స్వి జైస్వాల్ (45; 53 బంతుల్లో 9 ఫోర్లు), ర‌వీంద్ర జ‌డేజా (43; 83 బంతుల్లో 4 ఫోర్లు) తృటిలో హాఫ్ సెంచ‌రీలు చేజార్చుకున్నారు. ఓపెన‌ర్ కేఎల్ రాహుల్ (18; 33 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌) విఫ‌లం అయ్యాడు.

శ్రీలంక బౌల‌ర్ల‌లో అసిత ఫెర్నాండో నాలుగు వికెట్లు తీశాడు. ప్ర‌భాత్ జ‌య‌సూర్య, కేశర నువాంత చెరో రెండు వికెట్లు ప‌డ‌గొట్టారు. లహిరు కుమార ఓ వికెట్ సాధించాడు.